రాంచందర్ రావుకు కేటీఆర్ పంచ్

తెలంగాణ లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ముఖ్యంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ ఆరేళ్లలో తాము 1.32 లక్షల ఉద్యోగాలు కల్పించామని, దీనిపై ఎవరికైనా సందేహాలు ఉంటే చర్చకు సిద్ధమని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ చేశారు. గత రెండు మూడు రోజులుగా దీనిపైనే రాజకీయాలు నడుస్తున్నాయి.

తొలుత కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్.. గన్ పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద శుక్రవారం చర్చకు రావాలని కేటీఆర్ కు ఆహ్వానం పలికారు. ఆ మేరకు అక్కడకు వెళ్లి చాలాసేపు వేచి చేశారు. కానీ కేటీఆర్ రాకపోవడంతో ఆయనపై శ్రవణ్ ఫైర్ అయ్యారు. తాజాగా ఇదే అంశాన్ని బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు ఎత్తుకున్నారు. సోమవారం ఉస్మానియా ఆర్ట్స్ కళాశాలకు వెళ్లి.. ఉద్యోగాల భర్తీపై అక్కడకు చర్చకు రావాలని కేటీఆర్ కు సూచించారు.

ఈ మేరకు ఆయన అక్కడకు వెళ్లి వేచిచూశారు. కేటీఆర్ రాకపోవడంతో ఇదే అంశంపై ఆయనకు ట్వీట్ చేశారు. ‘నేను ఆర్ట్స్ కళాశాల వద్ద ఉన్నా.. కేటీఆర్ మీరు ఎక్కడున్నారు’ అని రాంచందర్ రావు కేటీఆర్ కు ట్వీట్ చేశారు. దీనిపై కేటీఆర్ పంచే వేశారు. ‘ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాల చొప్పున 12 కోట్ల ఉద్యోగాలు, అందరి జన్ ధన్ ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తానంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన హామీకి సంబంధించిన సమచారం తెలుసుకునే ప్రయత్నంలో బిజీగా ఉన్నా. ఎన్డీఏ అంటే నో డేటా అవైలబుల్.. అనే సమాధానం వస్తోంది. మీ దగ్గర వీటికి సమాధానాలు ఉంటే దయచేసి షేర్ చేయండి’ అని పంచ్ వేశారు.


Recent Random Post: