బ్యాచిలర్ పార్టీ ఇటలీలో పెళ్లి తిరుపతిలో..!

అందాల నటి శ్రీదేవి తన నటన తో యావత్ భారతదేశం అంతటా మంచి పేరు సంపాదించుకుంది. అయితే ఆమె అకస్మాత్తుగా మరణించడం భారత సినీ పరిశ్రమకు ఎనలేని లోటు ఏర్పడింది అనడంలో సందేహం లేదు. ఆమె వారసురాలిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన పెద్ద కూతురు జాన్వీ కపూర్ తన అంద చందాలతో నటన తో తల్లికి దగ్గ తనయురాలు అవుతుందన్న నమ్మకం కలిగించ గలిగింది. ప్రస్తుతం బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. అయితే ఎంత సెలబ్రిటీ అయినా కూడా తను కూడా సాధారణ అమ్మాయిల లాగే తన పెళ్లి గురించి కలలు కంటున్నానని ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో తెలిపింది.

వివరాల్లోకి వెళితే.. జాన్వీ కపూర్ తన పెళ్లికి సంబంధించిన ఎన్నో విషయాలను మీడియాతో తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో పంచుకుంది. అయితే పెళ్లి కంటే ముందు బ్యాచిలర్ పార్టీని తప్పకుండా చేసుకుంటానని అది చాలా గ్రాండ్ గా జరుపుతానని పేర్కొంది. పెళ్లికి ముందు తన స్నేహితులతో కలిసి దక్షిణ ఇటలీలోని కాప్రీ నగరంలో పడవలో బ్యాచిలర్ పార్టీ నిర్వహిస్తానని తెలిపింది. అయితే పెళ్లికి సంబంధించిన వేడుకలు మాత్రం మొదట మా అమ్మమ్మ ఇంటి నుంచే మొదలు పెడతుందని అన్నది. శ్రీదేవి సొంత ఊరు తమిళనాడులోని మైలాపూర్ కావడంతో మరియు అమ్మ శ్రీదేవికి చాలా ఇష్టమైన నివాసం కనుక అక్కడ నుంచే పెళ్లి వేడుకలు జరుపుకుంటానని జాన్వీ కపూర్ క్లారిటీ ఇచ్చింది.

ముఖ్యంగా పెళ్లికి ముందు జరిగే సంగీత్ మెహందీ వేడుకలు మైలాపూర్ లోని బంధువుల మధ్య జరుపుకుంటే చాలా సంతోషంగా ఉంటుందని తెలిపింది. అయితే పెళ్లి మాత్రం తిరుపతి లోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలోనే ఖచ్చితంగా చేసుకుంటానని తన పెళ్లిని చాలా నిరాడంబరంగా పద్ధతిగా చేసువడమే తనకు ఇష్టమని పేర్కొంది. దేవుని సన్నిధిలో పెళ్లి జరుపుకోవడం వల్ల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు తనకు ఎల్లప్పుడూ ఉంటాయని నమ్ముతానని చెప్పింది. పెళ్లిని మన భారతీయ సాంప్రదాయాలకు తగ్గట్లుగా చేసుకుంటానని తనకు కాంచీపురం చీర అంటే చాలా ఇష్టమని పెళ్లికి అదే చీర కట్టుకుంటానని తెలిపింది. ఇకపోతే మెహందీ మరియు సంగీత్లకు పసుపు గులాబీ బంగారు రంగుల్లో ఉండే బట్టలు ధరిస్తానని అవి తనకు చాలా బాగా సూటవుతాయని పేర్కొంది.

బంగారు ఆభరణాల కంటే డైమండ్ తో తయారు చేసిన నగలు అంటేనే తనకు బాగా ఇష్టమని పెళ్లికి డైమండ్ తో తయారు చేసిన వాటినే ధరిస్తానని జాన్వీ చెప్పింది. ఇక పెళ్లి కూడా రెండు రోజుల్లో ముగిసేలా ప్లాన్ చేసుకుంటానని పెళ్లి మండపాన్ని ఎక్కువగా పూలతో సాంప్రదాయంగా అలంకరిస్తే బాగుంటుందని తెలపింది. అసలు రిసెప్షన్ చేసుకోవాలనే ఆలోచన అయితే ప్రస్తుతం లేదని అన్నింటి కంటే ముందు పెళ్లి చేసుకోనేవాడు చాలా తెలివైన వ్యక్తి అయి ఉండాలని చెప్పింది. ప్రస్తుతం అయితే తనకు అలాంటి వ్యక్తులు ఎవరూ కనిపించలేదని పేర్కొంది.


Recent Random Post: