అఖిల్ జాతకం మార్చే దర్శకుడు పుట్టాడా?


అక్కినేని అఖిల్ నటించిన తొలి మూడు సినిమాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడం నాగార్జున సహా అక్కినేని కుటుంబాన్ని తీవ్రంగా నిరాశపరిచిన సంగతి తెలిసిందే. అఖిల్ ఎంత ప్రతిభ చూపినా.. హార్డ్ వర్క్ చేసినా ఆశించిన విజయం దక్కలేదు. అందుకే అతడికి ష్యూర్ షాట్ హిట్ అవసరం. ఇలాంటి వేళ సురేందర్ రెడ్డి.. కొరటాల శివ లాంటి సీనియర్ దర్శకులతో కింగ్ మంతనాలు సాగించారు.

ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ – గీతా ఆర్ట్స్ కాంబినేషన్ మూవీ `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్` పైనే అఖిల్ ఆశలన్నీ. ఈ మూవీ తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రేసింగ్ కాన్సెప్ట్ ఉన్న భారీ యాక్షన్ కామెడీ చిత్రంతో అఖిల్ నటించనున్నాడు.

పనిలో పనిగా ట్యాలెంటెడ్ డైరెక్టర్ల కోసం కింగ్ వేట సాగిస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. నాగార్జున తన చిన్న కొడుకు అఖిల్ కెరీర్ విషయంలో చేయాల్సిందంతా చేస్తున్నారు. అన్ని విధాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈసారి అతడిని స్టార్ గా నిలబెట్టాలన్న పంతంతో ఉన్నారు.

తాజా సమాచారం ప్రకారం.. ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సనాకి అక్కినేని నాగార్జున ఆఫర్ ఇచ్చారని గుసగుసలు వినిపిస్తున్నాయి. సెన్సిటివ్ ఎలిమెంట్స్ లవ్ స్టోరీతో ఉప్పెనను మలిచారు బుచ్చిబాబు. అందుకే బుచ్చి ట్యాలెంట్ చూశాక నాగార్జున మతి చెడిందట. అఖిల్ కి సరిపడే రొమాంటిక్ డ్రామాతో రావాలని నాగ్ అడిగారని ప్రచారమవుతోంది. ఒకవేళ ఇదే నిజమైతే నాగార్జుననే ఈ చిత్రాన్ని నిర్మించే వీలుందట. ఇది నిజమవుతుందో లేదో తెలుసుకోవడానికి కాస్త వేచి ఉండాలి.


Recent Random Post: