థియేటర్లలో కరోనా జాగ్రత్తలు తప్పనిసరి

ఏపీలో కరోనా కేసులు మరింతగా పెరుగుతున్న నేపథ్యంలో ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆరోగ్య శాఖ అధికారులతో పాటు ఉన్నతాధికారులు సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కరోనా కేసులు మరింతగా పెరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయమై చర్చించారు. ముఖ్యంగా థియేటర్లు మరియు మాల్స్ లో కరోనా జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాల్సిందిగా అధికారులు ఆదేశించారు. థియేటర్లలో కరోనా జాగ్రత్తలు పాటించకుంటే కఠిన చర్యలు తీసుకోవాల్సిందే అన్నారు.

థియేటర్లలో ప్రతి ఒక్కరికి కరోనా జాగ్రత్తల గురించి అవగాహణ కల్పించేందుకు గాను కొన్ని వీడియోలను మరియు స్లైడ్స్‌ ను ప్రదర్శించాలని థియేటర్ల యాజమాన్యాలకు సూచించారు. షో కు షో కు మద్య తప్పనిసరిగా సమయం తీసుకుని శానిటైజేషన్‌ పక్రియ జరిపించాల్సిందిగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. థియేటర్లు కరోనా కారకాలు కాకుండా ముందస్తు చర్యలు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. థియేటర్ల యాజమాన్యాలు ఏమాత్రం అలసత్వం చూపించినా కూడా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


Recent Random Post: