పిక్ టాక్: పీకేను ఫస్ట్ సినిమాకు సిద్ధం చేస్తోన్న చిరు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాదాపు మూడేళ్ళ గ్యాప్ తర్వాత తిరిగి పెద్ద తెర మీద కనిపించబోతున్నాడు. వకీల్ సాబ్ ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా విడుదల సందర్భంగా చిరంజీవి తనదైన శైలిలో స్పందించారు.

“చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ ని వెండితెర మీద చూడటానికి మీలాగే నేను కూడా ఎదురుచూస్తున్నాను. రేపు వకీల్ సాబ్ ను థియేటర్లో చూస్తాను. నా రెస్పాన్స్ ను మీ అందరితో షేర్ చేసుకుంటాను” అని చిరంజీవి ట్వీట్ చేసారు.

దీంతో పాటు నోస్టాల్జిక్ గా పవన్ కళ్యాణ్ ను మొదటి సినిమా కోసం సన్నద్ధం చేస్తోన్న ఫోటోను షేర్ చేసాడు చిరంజీవి. మెగా అభిమానులకు ఇది చాలా సంతోషాన్నిచ్చే విషయం. వకీల్ సాబ్ ను వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేయగా దిల్ రాజు నిర్మించాడు. భారీ ఎత్తున వకీల్ సాబ్ విడుదల కాబోతోంది.


Recent Random Post: