ఎవరేం అనుకున్నా ఫర్లేదు.. సన్నీ గేమ్ ప్లాన్ మారదంతే

ఎవరేం అనుకోనియండి.. బిగ్ బాస్ సీజన్ 5లో సన్నీ గేమ్ మాత్రం ఒకేలా ఉంటుంది. ఇప్పటికే అతని ఫ్యాన్స్ అతడి కోసం దేనికైనా సిద్ధమన్నట్లుగా ఉండటమేకాదు.. అతని మీద కించిత్ విమర్శ వస్తే చాలు.. దాన్ని ట్రోలింగ్ చేసే వరకు వెనుకాడని పరిస్థితి. గేములు పరంగా సన్నీ ఉత్సాహంగా పాల్గొంటాడన్న పాజిటివ్ పాయింట్ ను ఎవరూ కాదనలేం. కానీ.. గేమ్ ను గేమ్ మాదిరి కాకుండా వ్యక్తిగతంగా తీసుకోవటం.. అందుకోసం దేనికైనా సిద్ధమన్నట్లుగా మాట్లాడం బాగానే ఉన్నా.. ఆ క్రమంలో వేరే వారిని బలి పెట్టేందుకు సైతం సిద్ధం కావటమే సన్నీతో ఉన్న సమస్యగా చెప్పక తప్పదు.

బిగ్ బాస్ హౌస్ లో ఉన్న ఏడుగురిలో నలుగురు (సన్నీ.. మానస్.. కాజల్.. ప్రియాంక) ఒక జట్టుగా ఉండటం తెలిసిందే. గత వారం నుంచి పింకీ – మానస్ మధ్య కోల్డ్ వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. మొన్నటివరకు ఆమె సేవల్ని స్వీకరించటమే కాదు..ఆమె కేరింగ్ ను ఎంజాయ్ చేస్తూ.. తనకు అవకాశం వచ్చిన ప్రతిసారీ మేల్ ఇగోను దారుణంగా ప్రదర్శించే అతడు.. సెటిల్ ఫెర్ ఫార్మర్ ఎందుకు అవుతారన్నది పెద్ద ప్రశ్న.

ఒకరిపై ఇష్టం ఉండటం.. లేకపోవటం అన్నది వారి వ్యక్తిగత అంశం. దాన్ని ఎవరూ కాదనలేరు. ప్రియాంక మీద ఇష్టం లేదన్నది నిజమైనప్పుడు.. ఎంతవరకు ఉండాలో అంత వరకే ఉండాలే కానీ.. లైన్ దాట కూడదు కదా? ఈ కోణంలో చూసినప్పుడు పగటి పూట విసుక్కుంటూ.. రాత్రి అయ్యేసరికి హగ్గులు చేసుకోవటం.. మూడ్ బాగోలేదని గారం చేయటం దేనికి నిదర్శనం. తన మీద ప్రియాంక ఆశలు పెంచుకుంటున్న విషయాన్ని కన్ ఫెషన్ రూంలో నాగార్జున ఇచ్చిన ఫీడ్ బ్యాక్ తర్వాత నుంచి మానస్ లో మార్పు స్పష్టంగా కనిపించింది.

సాధారణంగా ఒక రిలేషన్ ను షురూ చేయటానికి ఉండే కసరత్తులకు తగ్గట్లే.. దాన్ని పుల్ స్టాప్ పెట్టాలన్నా అంతే కసరత్తు అవసరం. అలా అని అదేదో ప్లానింగ్ గా చేయాలని కాదు. ఆ మాటకు వస్తే ఇద్దరి వ్యక్తుల మధ్య రిలేషన్ షురూ ఎలా అయినా కావొచ్చు. దాన్ని ఒక దగ్గర కామా పెట్టాల్సి వచ్చినా.. పుల్ స్టాప్ పెట్టే పరిస్థితి ఉన్నాదానికో పద్దతి ఉందన్నది మర్చిపోకూడదు. ప్రియాంక లాంటి వారిని హ్యాండిల్ చేసే వేళలో హ్యాండిల్ విత్ కేర్ అన్నది మర్చిపోకూడదు. అందుకు భిన్నంగా మానస్ మాత్రంచాలా దురుసుగా వ్యవహరించటంఏ మాత్రం సబబు కాదు.

అయినప్పటికీ తనకున్న బాండ్ తో.. ఎలాంటి పరిస్థితి ఎదురైనా సరే.. సన్నీ వైరివర్గం (షణ్ణు.. సిరి.. శ్రీరామ్) గా ముద్ర పడిన వారిలో ఒకరిని టార్గెట్ చేయటమే తప్పించి.. తనకు బాండ్ ఉందనుకున్న వారి మీద ఫోకస్ చేయటం ఉండదన్నది తెలిసిందే.తప్పనిసరి పరిస్థితుల్లో సోమవారం ఎలిమినేషన్ రౌండ్లో కాజల్ ను నామినేట్ చేసిందే కానీ లేకుంటే లేదనే చెప్పాలి. సోమవారం నాటి ఎలిమినేషన్ రౌండ్ లో మరోసారి తన స్నేహ ధర్మానికి ప్రాధాన్యతను ఇస్తూ.. అందులో భాగంగా తన వైరి వర్గానికి చెందిన సిరి.. శ్రీరామ్ లను నామినేట్ చేశాడు సన్నీ.
ఆసక్తికరమైన విషయం ఏమంటే.. హౌస్ లో ఉన్న వారు ఎవరైనా తాము నామినేట్ చేసే విషయానికి వచ్చినప్పుడు తమకున్న కారణాలు చూడటం.. చాలా తక్కువ సందర్భాల్లోనే గ్రూపులకు ప్రాధాన్యత ఇవ్వటం కనిపిస్తుంది. సన్నీవిషయంలో మాత్రం ఇందుకు భిన్నం. తాజాగా శ్రీరామచంద్రను నామినేట్ చేసే సమయంలో.. తనకు వేరే ఆప్షన్ లేదని.. తన దోస్తుల్ని నామినేట్ చేయలేనంటూ శ్రీరామ్ పేరును చెప్పేయటాన్ని ఎవరూ కాదనలేరు. కాకుంటే..తప్పు చేస్తే బరాబర్ చెప్పేస్తానని మాటల్లో డాబును చూపించే సన్నీ.. చేతల విషయానికి వచ్చినప్పుడు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించటం తాజా ఎలిమినేషన్ రౌండ్లోనూ కనిపిస్తుంది.

ఎలిమినేషన్ కు సన్నీని నామినేట్ చేసే అవకాశం ఉన్నప్పటికీ షణ్ణూ.. సిరిలకు హద్దుల్ని క్రియేట్ చేయటంలో సన్నీ వ్యూహం ఫలించిందని చెప్పాలి. దీంతో.. వారిద్దరూ సన్నీని కాకుండా మరో ఇద్దరిని నామినేట్ చేసి ఊరుకున్నారు. మొత్తంగా తాజా ఎలిమినేషన్ ఎపిసోడ్ చూసినప్పుడు హౌస్ కెప్టెన్ గా షణ్ణు అందుకు మినహాయింపుగా ఇవ్వగా.. నామినేషన్ ప్రక్రియలో సన్నీ వ్యూహాత్మకంగా బయటపడ్డాడు. ఈ ఇద్దరు కాకుండా మిగిలిన ఐదుగురు (మానస్.. శ్రీరామ్.. ప్రియాంక.. కాజల్.. సిరి)ఎలిమినేషన్ గండాన్ని ఎదుర్కొంటున్నారు.


Recent Random Post: