హీరోయిన్ హాట్ ఫొటో షూట్కు బిగ్బి కామెంట్ వైరల్

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబచ్చన్ హుందాతనంలో ఉన్నతుడు అంటూ ఉంటారు. చాలా హుందగా ఉండటంతో పాటు ఆయన చాలా సరదాగా కూడా ఉంటారు. ఆయన సోషల్ మీడియా పోస్ట్ లు చాలా వరకు సామాజిక అంశాలపై ఉంటాయి. ఆయన సినిమాలు మరియు ఇతర విషయాల గురించి తక్కువే షేర్ చేస్తూ ఉంటాడు. అయితే ఇటీవల బచ్చన్ జీ చేసిన ఒక చిన్న కామెంట్ నెట్టింట వైరల్ అవుతోంది. హీరోయిన్ కృతి సనన్ తన హాట్ ఫొటో షూట్ ను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసింది. ఆ ఫొటో షూట్ లో కృతి చాలా హాట్ గా మరియు అందంగా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆ ఫొటోలకు బిగ్ బి అమితాబచ్చన్ కామెంట్ చేయడం హాట్ టాపిక్ అయ్యింది.

అమితాబచ్చన్ ఈ ఫొటోలకు స్పందిస్తూ వావ్ అంటూ లవ్ ఈమోజీని పోస్ట్ చేశాడు. బచ్చన్ జీ కామెంట్ కొన్ని నిమిషాల్లోనే వైరల్ అయ్యింది. అతి తక్కువ సమయంలోనే దాదాపుగా పది వేలకు పైగా లైక్ లను దక్కించుకుంది. బచ్చన్ జీ ఈ వయసులో కూడా మీరు కళా పోషకులనేనా అంటూ కొందరు కామెంట్ చేస్తూ ఉంటే మరి కొందరు ఆయన చేసి ఉండరేమో అంటూ మరి కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి హాట్ ఫొటోలకు బచ్చన్ జీ కామెంట్ వైరల్ అయ్యింది.


Recent Random Post: