యంగ్ దర్శకులందరినీ లైన్లో పెడుతోన్న చిరు

మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో ఎప్పుడూ లేనంత స్పీడ్ తో దూసుకుపోతున్నాడు. ఆచార్య రిలీజ్ కు సిద్ధంగా ఉండగా చిరంజీవి ఇప్పుడు గాడ్ ఫాదర్, భోళా శంకర్ చిత్రాల్లో నటిస్తున్నాడు. త్వరలోనే బాబీ దర్శకత్వంలో సినిమా చిత్రీకరణ కూడా మొదలవుతుంది.

రీసెంట్ సమాచారం ప్రకారం ఛలో, భీష్మ దర్శకుడు వెంకీ కుడుములతో చిత్రాన్ని ఓకే చేసాడు. ఈ సినిమా ప్రీప్రొడక్షన్ పనులను కూడా వచ్చే ఏడాది ప్రారంభంలో మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే మారుతి కూడా చిరంజీవి కోసం స్క్రిప్ట్ ను సిద్ధం చేసుకుంటున్నాడు.

తాజా సమాచారం ప్రకారం సక్సెస్ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి కూడా చిరంజీవితో వర్క్ చేయనున్నాడట. ప్రస్తుతం ఎఫ్3 చేస్తోన్న అనిల్ రావిపూడి, బాలకృష్ణతో ఒక సినిమా చేయాల్సి ఉంది. దాని తర్వాత చిరంజీవి సినిమా మొదలవ్వొచ్చు.


Recent Random Post: