యాంకర్ ప్రదీప్‌ మాచిరాజుకు పితృ వియోగం

యాంకర్‌ ప్రదీప్ మాచిరాజు తండ్రి పాండురంగ మాచిరాజు అనారోగ్య కారణాలతో మృతి చెందారు. నిన్న రాత్రి ఆయన మృతి చెందినట్లుగా కుటుంబ సభ్యులు చెబుతున్నారు. గత కొన్నాళ్లుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇటీవల ఆయన ఆరోగ్యం మరింతగా క్షీణించడంతో మృతి చెందినట్లుగా సమాచారం అందుతోంది. ప్రదీప్‌ గత కొన్ని వారాలుగా షోల్లో యాక్టివ్‌ గా కనిపించడం లేదు. దాంతో ఆయనకు కరోనా పాజిటివ్‌ అంటూ వార్తలు వచ్చాయి. ఆ విషయమై ప్రదీప్ స్పందించలేదు.

తండ్రి పాండురంగ మాచిరాజు ఆరోగ్యం సరిగా లేని కారణంగానే ప్రదీప్‌ షో లకు దూరంగా ఉంటూ వచ్చినట్లుగా తెలుస్తోంది. మరో వైపు పాండురంగ మాచిరాజు కు కరోనా పాజిటివ్‌ అంటూ నిర్థారణ అయ్యింది. ఆయన కరోనా నుండి బయట పడ్డ తర్వాత ఆరోగ్యం బాగు అవ్వక పోవడంతో మృతి చెందినట్లుగా చెబుతున్నారు. శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడ్డ పాండురంగ నిన్నరాత్రి శ్వాస తీసుకోవడంలో మరింతగా ఇబ్బంది పడి మృతి చెందారని కుటుంబ సభ్యులు అంటున్నారు.


Recent Random Post: