పుష్ప ఆమె కోసమే అలా మారిపోతాడట!!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ప్యాన్ ఇండియా చిత్రం పుష్ప లో నటిస్తోన్న విషయం తెల్సిందే. దీన్ని రెండు భాగాలుగా రూపొందిస్తున్నట్లు ఇప్పటికే అధికారికంగా వెల్లడించారు. పుష్ప ది రైజ్ డిసెంబర్ లో విడుదలవుతుంది. మొదటి భాగం దాదాపు 90 శాతం చిత్రీకరణ పూర్తయింది. అలాగే రెండో భాగం దాదాపు 30 శాతం చిత్రీకరణను పూర్తి చేసారు.

ప్రస్తుతం పుష్ప ది రైజ్ షూటింగ్ రంపచోడవరం అటవీ ప్రాంతాల్లో జరుగుతున్నాయి. రీసెంట్ గా ఒక చిన్న హోటల్ వద్ద అల్లు అర్జున్ టిఫిన్ తిని బిల్ కట్టిన వీడియో వైరల్ అయింది. ఇదిలా ఉంటే పుష్ప గురించి ఆసక్తికర విషయం బయటకు వచ్చింది.

పుష్ప రాజ్ సోదరిగా మిడిల్ క్లాస్ మెలోడీస్ భామ వర్ష బొల్లమ కనిపిస్తుందిట. ఆమెను కొందరు దుండగులు రేప్ చేసి హింసిస్తే దానికి అల్లు అర్జున్ క్రూరంగా మారి వారిని హతమారుస్తాడట. వర్ష బొల్లమకు సంబంధించిన సన్నివేశాలను చాలా హృద్యంగా తెరకెక్కించాడట సుకుమార్.


Recent Random Post: