#ఆచార్య .. లాహే లాహే మెగా మెరుపులే

ఆచార్య చిత్రం నుంచి లహే లాహే లిరికల్ వీడియో గ్లింప్స్ ఇప్పటికే అభిమానుల్లో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఏడాది కాలంగా ఈ మూవీ చిత్రీకరణ సమయంలో ఈ గ్లింప్స్ ని అభిమానులు రిపీటెడ్ గా యూట్యూబ్ లో వీక్షించారు. ఆ పాటకు ఎంచుకున్న టెంపుల్ నేపథ్యం.. గ్రాండియారిటీ నేచురల్ ట్రీట్ ప్రతిదీ ఆకట్టుకున్నాయి. చిరంజీవి నటించిన ఆచార్య చిత్రంలోని మొదటి పాట ఇది. తాజాగా మెగాస్టార్ స్టెప్పులతో కూడిన పాట గ్లింప్స్ ను చిత్రబృందం విడుదల చేసింది.

ప్రముఖ నటి సంగీతతో పాటు చిరంజీవి ఈ పాటలో అద్భుతమైన అభినయంతో ఆకట్టుకున్న విజువల్స్ .. ఇందులో మెగాస్టార్ మార్క్ స్టెప్పులు అలరిస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాని పెద్ద స్క్రీన్లపై చూసేందుకు ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. చిరు ఖైదీ నెం.150తో 7 సంవత్సరాల తర్వాత వెండితెరపైకి తిరిగి పునః ప్రవేశం చేసి ఘనమైన రీఎంట్రీని చాటుకున్నారు. సైరా తర్వాత ఇప్పుడు మరోసారి ఓ పవర్ ఫుల్ సబ్జెక్ట్ తో ప్రేక్షకులను అలరించబోతున్నాడు.

ఈ పాటను రామ్ చరణ్ అభిమానులు కూడా తన ట్విట్టర్ పేజీలో షేర్ చేసి అందరికీ పర్ఫెక్ట్ డ్యాన్స్ నంబర్ తో ట్రీట్ ఇస్తున్నారు. ఈ పెప్పీ నంబర్ ను హారిక నారాయణ్ – సాహితీ చాగంటి పాడగా.. సాహిత్యాన్ని రామజోగయ్య శాస్త్రి రాశారు. టెంపుల్ సెట్ బ్యాక్ డ్రాప్ తో మణి శర్మ కంపోజిషన్ దీనికి జానపద టచ్ ని ఇస్తుంది.

హరిదాస్ దళంతో చిరంజీవి కాలు కదిపే దృశ్యం ఫ్యాన్స్ ని ప్రత్యేకంగా ఆకట్టుకుంటోంది. ఈ వీడియోలో ఆచార్య సినిమా సెట్స్ లోని కొన్ని సన్నివేశాలు కూడా ఉన్నాయి. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ కథానాయిక. ఆచార్య చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ- మ్యాట్నీ ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ లపై రామ్ చరణ్ -నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో రామ్ చరణ్ తేజ పాత్ర సర్ ప్రైజింగ్ గా ఉండనుంది.

ఆచార్య సినిమాలో తనయుడు రామ్ చరణ్ తేజతో కలిసి పవర్ ఫుల్ పాత్రలో కనిపించనుండడంతో అభిమానుల్లో ఒకటే కోలాహాలం నెలకొంది. ఇప్పటికే దేవాదాయ శాఖ అవినీతి కుంభకోణాల నేపథ్యం అంటూ సాగిన ప్రచారంతో మూవీపై బోలెడంత హైప్ నెలకొంది. ఇందులో నక్సలిజం బ్యాక్ డ్రాప్ కూడా క్యూరియాసిటీని పెంచింది. ఏప్రిల్ 29న సినిమా విడుదలవుతోంది.


Recent Random Post: