డాడీ జిమ్ కోచ్ తో ప్రేమలో పడ్డ స్టార్ డాటర్?


మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కుమార్తె ఇరా ఖాన్ తొలి ప్రేమాయణం విఫలమైన సంగతి తెలిసిందే. మిషాల్ కృపాలానీతో లవ్ మ్యాటర్ ప్రతిదీ సోషల్ మీడియాలో ఓపెనైన ఇరా.. రెండేళ్ల డేటింగ్ అనంతరం 2019 డిసెంబర్ లో తమ లవ్వాయణాన్ని ముగించాలని నిర్ణయించుకున్నారు.

ఇరా ఆ తర్వాత ఏదో ఒక వ్యాపకంతో తనను తాను బిజీగా మలుచుకుంది. `యూరిపిడెస్ మెడియా` అనే థియేటర్ డ్రామాకు దర్శకత్వం వహించడం అప్పట్లో సంచలనమే అయ్యింది. తాను దర్శకత్వ విభాగంలో స్థిరపడుతుందని కూడా కథనాలొచ్చాయి.తాజా సమాచారం ప్రకారం.. ఇరా ఖాన్ మళ్ళీ ప్రేమలో పడిందని బాలీవుడ్ మీడియాలో గుసగుసలు వేడెక్కిస్తున్నాయి.

ఈసారి ఇరా తన ప్రేమ జీవితం చుట్టూ గోప్యతను కొనసాగించాలని కోరుకుంది. అందువల్ల సోషల్ మీడియాలో ఎలాంటి సమాచారం ఉండడం లేదు. ఆమె ప్రస్తుత డ్రీమ్ మ్యాన్ వివరాల్లోకి వెళితే.. గత ఏడెనిమిది నెలలుగా తన తండ్రి అమీర్ ఖాన్ ఫిట్నెస్ కోచ్ నుపూర్ శిఖారేతో డేటింగ్ చేస్తోందని గుసగుసలు వైరల్ అవుతున్నాయి.

ఇరా తన శరీరాకృతిని మెరుగు పరుచుకునేందుకు ప్రయత్నించే క్రమంలో ..ఈ లాక్ డౌన్ సమయంలో ఈ జంట కుదిరిందట. ఇక వీరిద్దరూ విడదీయరాని అనుబంధాన్ని కొనసాగించడం మొదలు పెట్టారట. మహాబలేశ్వర్ లోని ఖాన్ ఫామ్ హౌస్ లో వారు ఒకరితో ఒకరు సాంగత్యంలో గడిపారని తెలిసింది. వారు దాదాపు అన్ని పండుగలను తమ సన్నిహితులతో కలిసి జరుపుకున్నారు. ఇరా అతన్ని తన తల్లి రీనా దత్తాకు పరిచయం చేసింది. వారు ఒకరి గురించి ఒకరు చాలా డీప్ గా అర్థం చేసుకుని ప్రేమలో ఉన్నారని ఆ గుసగుస రివీల్ చేసింది. ఇంతకుముందు జిమ్ కోచ్ తో ఇరా సన్నిహితంగా ఉన్న ఫోటో కూడా అంతర్జాలంలో వైరల్ అయ్యింది.

నుపూర్ షికారే వివరాల్లోకి వెళితే.. అతడు ఫిట్ నెస్ నిపుణుడు మరియు కన్సల్టెంట్. అతను ఒక దశాబ్దం పాటు భారతదేశపు మొదటి మిస్ యూనివర్స్ సుశ్మితా సేన్ కి .. అలాగే మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ లకు వ్యక్తిగత శిక్షకుడు. ఇరాఖాన్ తన డాడీ జిమ్ కోచ్ ని ప్రేమించిందన్న వార్తల్ని అధికారికంగా కన్ఫామ్ చేయాల్సి ఉంది.


Recent Random Post: