బోల్డ్ హీరోయిన్‌ బాడీగార్డ్‌ పైన రేప్‌ కేసు నమోదు


బాలీవుడ్ ఫైర్ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ వద్ద సుదీర్ఘ కాలంగా బాడీ గార్డ్ గా పని చేస్తున్న కుమార్ హెగ్డే మీద ముంబయిలోని డీఎన్‌ నగర్ పోలీసు స్టేషన్‌ లో రేప్‌ కేసు నమోదు అయ్యింది. మేకప్ ఆర్టిస్టు అయిన ఒక యువతిపై కుమార్‌ హెగ్డే అఘాయిత్యంకు పాల్పడ్డట్లుగా పోలీసులు కేసు బుక్ చేశారు. రేప్ కేసు నమోదు అవ్వడంతో కుమార్‌ హెగ్డే ను పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ కేసు ప్రస్తుతం బాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఫిర్యాదు ఇచ్చిన యువతి కథనం ప్రకారం.. కుమార్‌ హెగ్డే మరియు ఆమెకు 8 ఏళ్లుగా పరిచయం ఉంది. ఈమద్య కాలంలో పెళ్లి చేసుకోవాలని ఇద్దరు భావించారట. పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించి బలవంతంగా శారీరకంగా అనుభవించాడట. తన వద్ద నుండి కొంత మొత్తంలో డబ్బును కూడా కుమార్‌ తీసుకున్నాడంటూ ఆమె ఫిర్యాదులో పేర్కొంది. పెళ్లి చేసుకోమని ఎంత బతిమిలాడినా కూడా కుమార్ ఒప్పుకోలేదు. పైగా కుమార్‌ తల్లి బాధితురాలికి ఫోన్ చేసి పెళ్లి చేసుకోవాలని తన కొడుకను ఒత్తిడి చేయవద్దంటూ హెచ్చరించిందట. కుమార్‌ హెగ్డే పై పోలీసులు రేప్‌ మరియు చీటింగ్ కేసును నమోదు చేశారు.


Recent Random Post: