సత్యం రామలింగరాజుకు షాకిచ్చిన నెట్ ఫ్లిక్స్!?

నెట్ ఫ్లిక్స్ వర్సెస్ సత్యం రామలింగరాజు కోర్టు కేసు వ్యవహారం తెలిసినదే. సత్యం రామలింగరాజు జీవితకథతో డాక్యు సిరీస్ తెరకెక్కించే ప్రయత్నాన్ని ఆయన కుటుంబీకులు అడ్డుకుంటున్నారు. దంతో నెట్ ఫ్లిక్స్ కోర్టుల పరిధిలో పోరాటం సాగిస్తోంది.

డిజిటల్ దిగ్గజం నెట్ఫ్లిక్స్ తెలంగాణ హైకోర్టు హియరింగులో మాట్లాడుతూ సత్యం సీఈఓ రామలింగరాజు జీవిత కథపై డాక్యుమెంటరీ చేయడానికి ఆయన అనుమతి పొందాల్సిన అవసరం లేదని.. మొత్తం కంటెంట్ .. అవసరం మేర సమాచారం పబ్లిక్ డొమైన్ లో అందుబాటులో ఉందని వాదించారు. నెట్ ఫ్లిక్స్ నిన్న డివిజన్ బెంచ్ ముందు ఈ విషయంపై సమర్పణ పత్రాన్ని ఉంచింది.

రామలింగరాజు- విజయ్ మాల్యా- మెహుల్ చోక్సీ – సుబ్రతా రాయ్ జీవిత కథలపై `బాడ్ బాయ్ బిలియనీర్స్` సిరీస్ ని నెట్ ఫ్లిక్స్ రూపొందించింది. అయితే రిలీజ్ పై స్టే వివాదం ఇబ్బందికరంగా మారింది. దిగువ కోర్టు ఉత్తర్వులు జారీ చేసిన తరువాత నెట్ఫ్లిక్స్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. నెట్ఫ్లిక్స్ కూడా డాక్యుమెంటరీ సిరీస్ కేవలం కుంభకోణానికి సంబంధించినదని రామలింగరాజు కుటుంబ సభ్యులతో ఎటువంటి సంబంధం లేదని వాదించింది.

రామలింగరాజు సహచరులలో ఒకరు సినిమాకి సంబంధించిన విషయాల సేకరణకు ఆర్కైవ్ లను ఉపయోగించడానికి అనుమతి ఇచ్చారన్న వాదనను తెరపైకి తెచ్చారు. మొదట్లో డాక్యుమెంటరీకి అనుమతి ఇచ్చిన తరువాత రామలింగరాజు యు-టర్న్ తీసుకున్నారని నెట్ఫ్లిక్స్ వాదించింది. కోర్టు తదుపరి విచారణను డిసెంబర్ 4 కి వాయిదా వేసింది. డిజిటల్లో సత్యం రామలింగరాజు ఉత్థాన పతనాల్ని వీక్షించే అవకాశం తెలుగు ఆడియెన్ కి ఉందా లేదా? అన్నది చూడాలి.


Recent Random Post: