కాక్ టెయిల్ ఆ భారత విద్యార్థి ప్రాణాలు తీసింది..

‘కాక్ టెయిల్’ ఈ రకం మద్యం తాగితే ప్రాణం పోతుందని ఇంతవరకూ ఎవరూ చెప్పలేదు. ఇక ఎవరు వినలేదు. నిషానిచ్చే ఈ మధ్యపానమే తాజాగా ఓ భారతీయ విద్యార్థి ఉసురుతీసింది. దురదృష్టం అతడిని వెంటాడింది. మద్యం తాగి ఒక భారతీయ విద్యార్థి మరణించడం విషాదం నింపింది.

కేంబ్రిడ్జ్ యూనివర్శిటీలో మెడిసిన్ చదువుతున్న శివ మిస్త్రీ మరణం అందరినీ షాక్ కు గురిచేసింది. 18 ఏళ్ల ఇతడు ఇటీవలే తన పరీక్షలు పూర్తి చేసాడు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో కళాశాలలో చేరవలసి ఉంది. స్పెయిన్లో స్నేహితులతో కలిసి శివ విహారయాత్రకు వెళ్లాడు. కోస్టా డెల్ సోల్లో సెలవులో ఎంజాయ్ చేస్తున్నాడు. శివ కి సాఫ్ట్ డ్రింక్ బదులుగా కాక్ టెయిల్ పానీయాన్ని అందించగా అతడు తాగాడు.

ఈ క్రమంలోనే వెంటనే శివకు అలెర్జీ రియాక్షన్ అయ్యింది. వెంటనే సృహ తప్పి పడిపోయాడు. అతని స్నేహితులు వైద్యులు మరియు పోలీసులు అతనిని బతికించడానికి ట్రై చేస్తూ ఆస్పత్రికి తరలించారు. అయితే అతను అప్పటికే చనిపోయాడు. శివకు అలర్జీ సంబంధిత అనాఫిలాక్సిస్ అనే జబ్బు ఉందని.. దీని ద్వారానే అతడు చనిపోయాడని వైద్యులు తెలిపారు.

ఇంకా పూర్తి స్థాయి జీవితాన్ని ప్రారంభించని యువకుడు ఎన్నో ఆశలతో ఇలా విదేశాల్లో చదువులకు వెళితే.. విహారయాత్ర అతడిపాలిట విషాదయాత్రగా మారింది. శివకు స్నేహితులు కుటుంబ సభ్యులు మరియు అతని పాఠశాల ప్రధానోపాధ్యాయులు తమ సంతాపాన్ని తెలియజేశారు.

శివ్ హై వైకోంబ్లోని రాయల్ గ్రామర్ స్కూల్లో విద్యార్థి. శివ చదువులో ఎంతో చురుకైన విద్యార్థి అని ఉపాధ్యాయులు తెలిపారు. అనాఫిలాక్సిస్ యూకే కోసం నిధులను సేకరించి తన ఉదారత చాటాడని గుర్తు చేసుకుంటున్నారు.

శివ కుటుంబం నుండి అభ్యర్థన మేరకు శివ అంత్యక్రియల కోసం తోటి విద్యార్థులంతా విరాళాలు సేకరిస్తున్నారు. అలెర్జీలు మరియు అనాఫిలాక్సిస్ ఉన్న వ్యక్తులకు ఏదైనా తమకు పడని పానీయాలు తాగేటప్పుడు జాగ్రత్త వహించాలని పలువురు చూస్తున్నారు.


Recent Random Post: