‘కాంతార’ తరహాలో ఆ రెండు చిత్రాలపైనా కాన్పిడెన్స్!

ఇటీవల చిన్న చిత్రాలే సంచలనాలు నమోదు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయి వసూళ్లతో బాక్సాఫీస్ నే షేక్ చేస్తున్నాయి. పది -పదిహేన కోట్ల బడ్జెట్ తెరకెక్కిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద వందల కోట్లు కొల్లగొడుతున్నాయి. ఇటీవల రిలీజ్ అయిన `కాంతార`…`కార్తికేయే-2` చిత్రాలనే ఉత్తమ ఉదహారణలుగా చెప్పొచ్చు.

వందల కోట్లు ఖర్చు పెట్టి చేసిన సినిమాలు తుస్సు మంటుంటే? ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన కంటెంట్ బేస్డ్ చిత్రాలు సైలెంట్ గా షాకిస్తున్నాయి. వీటిని చూసి అగ్ర నిర్మాతల్లో సైతం మార్పులొస్తున్నాయి. కాంబినేషన్ కన్నా కంటెంట్ కి ప్రాధాన్యం ఇవ్వాలన్న విషయం అర్ధమవుతుంది. తాజాగా ఇటీవల రిలీజ్ అయిన ఓ రెండు చిన్నచిత్రాలు భారీ సక్సెస్ వైపుగా దూసుకెళ్తున్నట్లు తెలుస్తోంది.

ఇటీవలే బాలీవుడ్ లో ‘జయ జయ జయహే’ అనే ఓచిన్న సినిమా రిలీజ్ అయింది. ఇందులో భారీ తారాగణం లేదు. టెక్నికల్ టీమ్ లేదు. కేవలం 5 కోట్ల బడ్జెట్ తో పరమిత నటులతో తెరకెక్కించారు. ఇప్పుడీ సినిమా యాభైకోట్ల వసూళ్ల దిశగా అడుగులు వేస్తున్నట్లు బాలీవుడ్ మీడియా కథనాలు వేడెక్కిస్తున్నాయి. బాక్సాఫీస్ వద్ద సౌండింగ్ బాగుందన్న టాక్ వినిపిస్తుంది.

అన్ని వర్గాల ప్రేక్షకుల్ని సినిమా ఆకట్టుకుంటుందన్నది పబ్లిక్ టాక్. ఈ సినిమా రిలీజ్కి ముందు ఎలాంటి హడావుడి లేదు. మీడియా కూడా పట్టించుకోలేదు. కానీ రిలీజ్ తర్వాత సీన్ మరోలా కనిపిస్తుంది. పాజిటివ్ టాక్ సినిమా వైపు ఆకర్షితులవుతున్నారు. అలాగే కోలీవుడ్ చిత్రం `లవ్ టుడే` కూడా ఇలాంటి టాక్ నే సొంతం చేసుకుంటుంది.

రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం ఎమోషనల్ గా కనెక్ట్ అవుతుంది. తెలుగు రిలీజ్ కొద్ది థియేటర్లో జరగడంతో అంతగా రీచ్ అవ్వడం లేదు. కానీ చూసిన వారు మాత్రం బాగుందనే ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారు. ఈసినిమా కూడా తక్కువ బడ్జెట్ లో నూతన నటీనటులతోనే తెరకెక్కించారు. కోలీవుడ్ లో మాత్రం సంచలన హిట్ చిత్రంగా బాక్సాపీస్ వద్ద దూసుకుపోతుంది. అక్కడ మార్కెట్లో రికార్డు బ్రేక్ వసూళ్లు సాధిస్తుందని కోడంబాక్కం వర్గాలు అంటున్నాయి.


Recent Random Post: