ఆ ఖర్చుల కోసమే పవన్ ప్రాజెక్ట్ లు ఓకే చేస్తున్నాడా?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జనసేన పార్టీ కార్యకలాపాల్లో భాగంగా మూడున్నరేళ్ల పాటు సినిమాలకు దూరంగా వుంటూ వచ్చారు. ఆ తరువాత అభిమానుల ఒత్తిడి వల్ల మూడున్నరేళ్ల విరామం తరువాత మళ్లీ సినిమాల్లో నటించడం మొదలు పెట్టారు. `వకీల్ సాబ్` మూవీ కోసం పవన్ మళ్లీ కెమెరా ముందుకు రావడం.. మేకప్ వేసుకోవడం తెలిసిందే. ఆ తరువాత కూడా పలు సినిమాలని అంగీకరించారు. భారీ స్థాయిలో పలు నిర్మాణ సంస్థల నుంచి అడ్వాన్స్ లు తీసుకున్నారు.

భారీ చిత్రాల నిర్మాత ఏ.ఎం.రత్నంతో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. `హరి హర వీరమల్లు` పేరుతో ఓ మూవీని కూడా మొదలు పెట్టిన విషయం తెలిసిందే. క్రిష్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ నెలలు గడుస్తున్నా ఇంత వరకు పూర్తి కావడం లేదు. కారణం పవన్ కల్యాణ్ పొలిటికల్ షెడ్యూల్ తో బిజీగా వుండటమే. ఎట్టకేలకు రీసెంట్ గా మొదలైనా కానీ ఆగుతూ సాగుతూ వెళుతోంది. తాజాగా మరో సినిమాని సుజీత్ డైరెక్షన్ లో పవన్ అంగీకరించడం.. ఆ ప్రాజెక్ట్ ని అధికారికంగా ప్రకటించడం తెలిసిందే.

పవన్ సినిమాలని అంగీకరించడానిక ప్రధాన కారణం పార్టీ కార్యకలాపాల ఖర్చుల కోసమే నని 2024 ఎన్నికలని దృష్టిలో పెట్టుకుని పవన్ వరుస సినిమాలని అంగీకరిస్తూ అడ్వాన్సులు తీసుకుంటున్నారని తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలని నిజం చేస్తూ ఇటీవల పవన్ పాస్ చేసిన స్టేట్ మెంట్ ఇందుకు అద్దంపడుతోంది. ఇతరులు విరాళాలతో తాను పార్టీని నడపబం లేదని తన సొంత ఖర్చులతో పార్టీని నడుపుతున్నానని ప్రకటించడం తెలిసిందే.

గత రెండేళ్ల క్రితం పవన్ కల్యాణ్ స్టార్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ వారి వద్ద రీసెంట్ గా పీపుల్ మీడియా వారి వద్ద కూడా భారీ స్థాయిలో అడ్వాన్స్ లు తీసుకున్నారు. ఇందులో మైత్రీ వారి నిర్మాణంలో హరీష్ శంకర్ తో `భవదీయుడు భగత్ సింగ్` చేస్తానని మాటిచ్చారు. కానీ ఇంత వరకు ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడం లేదు. సుజీత్ ప్రాజెక్ట్ తరహాలోనే హరీష్ శంకర్ ప్రాజెక్ట్ ని కూడా త్వరలో సెట్స్ పైకి తీసుకెళ్లాలనుకుంటున్నారట.

2024 ఎన్నికల ఖర్చుని దృష్టిలో పెట్టుకుని ముందుగా అంగీకరించిన సినిమాలని పూర్తి చేయబోతున్నారట. మిగతా సినిమాలని ఎన్నికల తరువాతే మొదలు పెట్టే అవకాశం వుందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఒక వేళ పవన్ ప్రారంభించని పక్షంలో తీసుకున్న అడ్వాన్స్ లు తిరిగి ఇచ్చేయాల్సి వుంటుంది. ఆ కారణంగానే ఈ ప్రాజెక్ట్ లని పూర్తి చేయబోతున్నారట.


Recent Random Post: