ఆర్యన్ ఖాన్ ఫోన్ లో అశ్లీల ఫొటోలు వీడియోలు


బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఎన్సీబీ అధికారులకు ప్రస్తుతం కోర్టు కస్టడీకి అప్పగించడంతో విచారణ సాగుతోంది. పక్కా ఆధారాలతోనే ఆర్యన్ ఖాన్ ను పట్టుకున్నట్లు సమాచారం. ఆయన మొబైల్ కూడా సీజ్ చేసి విచారణ జరుపుతున్నట్టు తెలిసింది. ఈ ఫోన్ లో ఆసక్తికరమైన విషయాలు సంచలనమైన అంశాలను ఎన్సీబీ అధికారులు దృష్టికి తెచ్చినట్టు సమాచారం. ఆర్యన్ ఖాన్ అరెస్ట్ తర్వాత డ్రగ్స్ సప్లయిర్స్ పై ఎన్సీబీ పంజా విసురుతూ అరెస్ట్ ల పర్వాన్ని కొనసాగిస్తోంది.

ఆర్యన్ ఖాన్ ను అరెస్ట్ చేశాక.. ఈ కేసులో సంబంధం ఉన్న వారిని అరెస్ట్ లు చేస్తున్నారు. ఈ కేసులో మరో ఆరుగురిని ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఢిల్లీకి చెందిన ఈవెంట్ మేనేజ్ మెంట్ కంపెనీ నమాస్ కే ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. క్రూయిజ్ లో పార్టీని ఏర్పాటు చేసి డ్రగ్స్ సరఫరా చేసిన కేసులో వారిని విచారిస్తున్నారు. ఇప్పటివరకు ఈ కేసులో అరెస్ట్ చేసిన వారి సంఖ్య 16కు పెరిగింది.

ఎన్సీబీ అదుపులో ఉన్న తన కుమారుడు ఆర్యన్ ఖాన్ ను షారుఖ్ ఖాన్ ప్రత్యేక అనుమతితో ఆదివారం లాకప్ లో కలిశారు. తన తండ్రిని లాకప్ ఎదుట చూడగానే ఆర్యన భోరున విలపించారు. వారిద్దరి మధ్య ఎమోషనల్ సంఘటనలు కనిపించాయి. ఆర్యన్ ను పలు విషయాలు అడిగి షారుఖ్ తెలుసుకున్నాడని ఎస్సీబీ వర్గాల ద్వారా తెలిసింది.

ఇక ఎస్సీబీ అధికారులు వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఆర్యన్ ఖాన్ బోరున విలపిస్తున్నట్టు సమాచారం. తన తండ్రిని ఇంటిలో కలుసుకునేందుకు అనుమతి ఇవ్వాలని అధికారులను ఆర్యన్ కోరినట్టు తెలుస్తోంది. అయితే అందుకు ఎన్సీబీ అధికారులు నిరాకరించినట్టు సమాచారం.

ఇక ఆర్యన్ ఖాన్ మొబైల్ ఫోన్ ను పరిశీలించగా కొన్ని షాకింగ్ సీక్రెట్స్ బయటపడ్డట్టు సమాచారం. ఆయన మొబైల్ లో కొన్ని అభ్యంతరకర ఫొటోలు అశ్లీల వీడియోలు లభించినట్టు సమాచారం. కొందరు సెలబ్రెటీలతో కూడిన ఫొటోలు కూడా షాకింగ్ కు గురిచేసేలా ఉన్నాయనేది ఎస్సీబీ అధికారులు అనధికారికంగా మీడియాకు వెల్లడించినట్టు తెలిసింది. మొత్తంగా డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ కు ఉచ్చు బిగుస్తున్నట్టు తెలుస్తోంది.


Recent Random Post: