హీరోలు హీరోయిన్లకు సిగ్గూశరం లేదాః సీనియర్ నటుడు ఫైర్


దేశంలో కరోనా మహమ్మారి వేలాది మంది ప్రాణాలు పొట్టన పెట్టుకుంటోంది. రోజుకు లక్షలాది మంది కొవిడ్ బారిన పడుతున్నారు. ఆసుపత్రుల్లో చోటు లేక.. దిక్కులేని చావు చస్తున్నారు. దేశం మొత్తం ఇలాంటి కండీషన్లో ఉంటే.. కొందరు సినిమా సెలబ్రిటీలు మాత్రం ఆనందాల్లో మునిగిపోతున్నారు. సోషల్ మీడియా వేదికగా అందాలు ఆరబోస్తున్నారు. దీనిపై సీనియర్ నటుడు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేశారు.

ఇవాళ కరోనా హెల్త్ బులిటెన్ చూస్తే.. పరిస్థితి మరింత దారుణంగా తయారైన విషయం తెలుస్తోంది. మొన్న 3 లక్షల 33 వేల కేసులు నమోదు కాగా.. ఆ సంఖ్య నిన్నటికి 3 లక్షల 50 వేలకు చేరింది. ఈ పరిస్థితి ఇంకా ఏందాక వెళ్తుందో అర్థంకాకుండా ఉంది. దీంతో.. దేశం మొత్తం భయం గుప్పిట బతుకుతోంది. కానీ.. కొందరు సినిమా హీరోలు హీరోయిన్లు ఇవేవీ పట్టించుకోకుండా విదేశాల్లో హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్నారు.

దీంతో.. బాలీవుడ్ సీనియర్ నటుడు నవాజ్ సిద్ధికీ వారిపై మండిపడ్డట్టు తెలుస్తోంది. హీరోలు హీరోయిన్లపై ఘాటు విమర్శలు చేశారని సమాచారం. దేశంలో ఇంతటి దారుణమైన పరిస్థితులు ఉంటే.. మీరు విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్నారా? అని ప్రశ్నించారట. కరోనా బాధితులు డబ్బుల్లేక ప్రాణాలు కోల్పోతుంటే.. మీరు విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారా? అని ఆగ్రహం వ్యక్తంచేశారని తెలుస్తోంది.

ఇందుకు గానూ.. వాళ్లకు వాళ్లే సిగ్గు పడాల్సిన అవసరం ఉందని అన్నారట నవాజ్. ప్రపంచం దారుణమైన పరిస్థితుల్లో కూరుకుపోతుంటే.. సెలబ్రిటీలు విహార యాత్రలకు వెళ్లడం బికినీ అందాలను సోషల్ మీడియాలో పోస్టు చేయడం సిగ్గుచేటని అన్నట్టు సమాచారం. హాలీడేస్ కు పోతేపోయారు.. ఇలాంటి పరిస్థితుల్లో ఆ ఫొటోలు షేర్ చేయడం అవసరమా? కనీసం సిగ్గు తెచ్చుకోవాలి అని సిద్ధిఖీ వ్యాఖ్యానించినట్టు సమాచారం.


Recent Random Post: