సాయి తేజ్ ను పరామర్శించిన చరణ్ – ఉపాసన దంపతులు..!

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదానికి గురై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగిన వెంటనే చిరంజీవి – పవన్ కళ్యాణ్ – అల్లు అరవింద్ సహా మెగా ఫ్యామిలీ అంతా ఆసుపత్రికి చేరుకొని సాయి తేజ్ ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూనే ఉన్నారు. ఈ క్రమంలో నేడు రామ్ చరణ్ – ఉపాసన దంపతులు కూడా తేజ్ ను పరామర్శించేందుకు ఆసుపత్రికి వచ్చారు.

ఈరోజు శనివారం ఉదయం సతీమణి ఉపాసనతో కలిసి వచ్చిన రామ్ చరణ్.. సాయితేజ్ ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. చిరంజీవి – సురేఖ దంపతులు కూడా ఆసుపత్రికి చేరుకున్నారు. ఇక సాయితేజ్ కు ప్రమాదం జరిగిందని తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు అపోలో ఆస్పత్రికి చేరుకుని ఆయన్ని పరామర్శిస్తున్నారు.

రాశీ ఖన్నా – ప్రకాశ్ రాజ్ – శ్రీకాంత్ – మంచు లక్ష్మి – మంచు విష్ణు దంపతులు తదితరులు ఈరోజు సాయితేజ్ ను పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు తెలుసుకున్నారు. తేజ్ త్వరగా కోలుకోవాలని క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని సినీ ప్రముఖులు అభిమానులు శ్రేయోభిలాషులు సోషల్ మీడియా వేదికగా కోరుకుంటున్నారు.

ఇదిలా ఉంటే రోడ్డు ప్రమాదానికి గురై చికిత్స పొందుతున్న సాయి తేజ్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఈరోజు ఉదయం హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ‘సాయి తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉంది. ప్రధాన అవయవాలు బాగానే పనిచేస్తున్నాయి. ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నాం. ఈ రోజు మరిన్ని వైద్య పరీక్షలు నిర్వహిస్తాం. రేపు మరో బులెటిన్ విడుదల చేస్తాం’ అని అపోలో ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు.


Recent Random Post: