షారుఖ్ వచ్చేశాడు ఇక వాళ్లిద్దరు కూడా వస్తే..!

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ పఠాన్ జవాన్ రెండు సినిమాలతో తిరిగి సూపర్ ఫాం లోకి వచ్చాడు. దశాబ్ధాలుగా షారుఖ్ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న ఆయన ఫ్యాన్స్ ఈ ఏడాది రెండు బ్లాక్ బస్టర్ హిట్లతో సూపర్ జోష్ లో ఉన్నారు. పఠాన్ సినిమా బాలీవుడ్ డైరెక్టర్ తో చేసిన షారుఖ్ జవాన్ ని తమిళ దర్శకుడు అట్లీతో చేశాడు. ఈ రెండు సినిమాలు షారుఖ్ బాక్సాఫీస్ స్టామినా ఏంటన్నది ప్రూవ్ చేశాయి. ఇదే ఏడాది మరో సినిమాతో వస్తున్నాడు షారుఖ్.

షారుఖ్ సినిమా బాక్సాఫీస్ దగ్గర సందడి చేసి చాలా రోజులవుతుంది. షారుఖ్ హిట్ కొడితే ఆ సినిమా చేసే వసూళ్ల హడావిడి ఎలా ఉంటుందో తెలుస్తుంది. అయితే కొన్నాళ్లుగా సరైన ఫాం లో లేని షారుఖ్ హిట్ ట్రాక్ ఎక్కేశాడు. షారుఖ్ తర్వాత ఆమీర్ ఖాన్, అక్షయ్ కుమార్ లు కూడా ఫాం లోకి రావాల్సి ఉంది. బాలీవుడ్ లో అక్కి భాయ్ సక్సెస్ రేటు తెలిసిందే. కానీ ఈమధ్య ఆయన సినిమాలు కూడా అక్కడ బోల్తా కొడుతున్నాయి.

అక్షయ్ కుమార్ సినిమాలు ఇంత దారుణంగా పోవడం ఆ హీరో ఫ్యాన్స్ ని టెన్షన్ లో పడేస్తుంది. అక్షయ్ ఓ సాలిడ్ హిట్ తో కం బ్యాక్ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. ఇక మరోపక్క ఆమీర్ ఖాన్ కూడా వరుస ఫ్లాపులు అందిస్తూ కెరీర్ లో వెనకపడ్డాడు. మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమీర్ ఖాన్ తన మార్క్ ప్రయోగాలతో బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేశారు. కానీ ఎందుకో ఈమధ్య ఆయన ఏ సినిమా చేసినా ప్రేక్షకులను ఇంప్రెస్ చేయట్లేదు. అందుకే ఆమీర్ ఖాన్ సినిమాలకు కొద్దిపాటి బ్రేక్ ఇచ్చారు.

మరోపక్క సల్మాన్ ఖాన్ కూడా హిట్లు ఫ్లాపుల మధ్య ఉన్నాడు. షారుఖ్ హిట్ ఫాం తో మిగతా హీరోల ఫ్యాన్స్ కూడా తమ హీరోలు కూడా తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కాలని కోరుతున్నారు. షారుఖ్ తర్వాత నేషనల్ లెవెల్ లో స్టామినా చూపించే హీరో ఎవరన్నది చూడాలి. అక్షయ్ కుమార్ ప్రస్తుతం ఏడు సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి అందులో నాలుగు షూటింగ్ జరుపుకుంటుండగా ఒకటి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. మిగతా రెండు సినిమాలు ప్రీ ప్రొడక్షన్ లో ఉన్నాయి. లాల్ సింగ్ చద్దా సినిమా తర్వాత ఆమీర్ ఖాన్ సలాం వెంకీ సినిమాలో క్యామియో రోల్ చేశాడు. నెక్స్ట్ సినిమాకు గ్యాప్ తీసుకునే ఆలోచనలో ఉన్నారు ఆమీర్.


Recent Random Post: