శింబు బర్త్ డే సందర్భంగా రవితేజ వదిలిన ‘రీవైండ్’ టీజర్..!


కోలీవుడ్ హీరో శింబు – కల్యాణి ప్రియదర్శన్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘మానాడు’. ఈ చిత్రానికి క్రియేటివ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. వి హౌస్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత సురేష్ కామాచి 125 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో తెలుగు తమిళ హిందీ కన్నడ మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. అయితే తెలుగులో ఈ చిత్రాన్ని ”రీవైండ్” అనే పేరుతో రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. నేడు హీరో శింబు పుట్టినరోజు సందర్భంగా మాస్ మహారాజా రవితేజ ‘రీవైండ్’ టీజర్ ని రిలీజ్ చేసాడు.

ఈ సందర్భంగా రవితేజ ట్వీట్ చేస్తూ శింబు పుట్టినరోజు సందర్భంగా ఈ భారీ బడ్జెట్ చిత్రం తెలుగు వెర్షన్ టీజర్ రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉందని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఇక టీజర్ విషయానికొస్తే ‘సమయం ఎవరి కోసం ఎదురు చూడదు.. అదే ఒకరి కోసం సమయం ఎదురు చూస్తే ఏమవుతుంది?’ అనే థీమ్ తో ఆకట్టుకునేలా ఉంది. ఈ సినిమా టైటిల్ కి తగ్గట్టే రీవైండ్ కాన్సెప్ట్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. విభిన్నమైన సినిమాలను తెరకెక్కించే విక్రమ్ ప్రభు మరో డిఫరెంట్ మూవీతో రాబోతున్నాడని అర్థం అవుతోంది. ఈ పొలిటికల్ థ్రిల్లర్ లో శింబు ముస్లిం యువకుడిగా కనిపిస్తున్నాడు.

‘రీవైండ్’ చిత్రంలో సీనియర్ దర్శకులు భారతీరాజా – ఎస్.ఏ.చంద్రశేఖర్ – ఎస్.జె.సూర్య – కరుణాకరన్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం సమకూర్చుతున్నారు. ఇకపోతే ఈ చిత్రం హిందీ టీజర్ బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ – తమిళ్ టీజర్ ను ఏ.ఆర్.రెహమాన్ – కన్నడ టీజర్ ను కిచ్చా సుదీప్ – మలయాళ టీజర్ ని పృథ్వీరాజ్ రిలీజ్ చేశారు.


Recent Random Post: