వీరయ్యకు వెల్కమ్ చెప్పిన భోళా శంకర్

వాల్తేర్ వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మెగాస్టార్ చిరంజీవి తన నెక్స్ట్ సినిమా షూటింగ్ కి రెడీ అయిపోయాడు. మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ అనే సినిమాని మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీని ఎప్పుడో ఎనౌన్స్ చేసేశారు. అయితే వాల్తేర్ వీరయ్య సినిమా తర్వాత స్టార్ట్ చేయాలని చిరంజీవి ఈ ప్రాజెక్ట్ ని వెనక్కి నెట్టారు. దీనికి కారణం భోళా శంకర్ మూవీ తమిళ్ హిట్ మూవీ వేదాలం రీమేక్ గా తెరకెక్కుతుంది.

2015లో అజిత్ హీరోగా ఈ సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయ్యింది. అయితే ఆ సినిమాలో మెయిన్ ఎలిమెంట్ ని తీసుకొని మెగాస్టార్ ఇమేజ్ కి సరిపోయే విధంగా కథ కథనంలో మార్పులు చేసి మెహర్ రమేష్ సరికొత్తగా స్క్రిప్ట్ ని సిద్ధం చేశారు. ఈ నేపధ్యంలో చిరంజీవి ఇంప్రెస్ అయ్యి సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లడానికి రెడీ అయ్యారు.

ఇక ఈ మూవీని ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ ఆచంట నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీ షూటింగ్ ని అఫీషియల్ గా హైదరాబాద్ లో స్టార్ట్ చేశారు. ఫస్ట్ షెడ్యుల్ కోసం ప్రత్యేకంగా కలకత్తా కాళీ టెంపుల్ సెట్ వేశారు.

ఇక ఈ సెట్ లో షూటింగ్ ప్రారంభించారు. ఇక ఈ షూటింగ్ లో మెగాస్టార్ చిరంజీవి కూడా పాల్గొన్నాడు. దానికి సంబందించిన వీడియోని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. షూటింగ్ లొకేషన్ లో మెగాస్టార్ కేక్ కట్ చేసి దర్శకుడు మెహర్ నిర్మాత రామ్ ఆచంట కీర్తి సురేష్ కి తినిపించారు.

ఈ మూవీలో కీర్తి సురేష్ మెగాస్టార్ కి చెల్లెలుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో మొదటి రోజు చిరంజీవి కీర్తి కాంబినేషన్ లో సన్నివేశాలు చిత్రీకరించినట్లు తెలుస్తుంది. ఈ మూవీలో చిరంజీవికి జోడీగా తమన్నా నటిస్తుంది.

మణిశర్మ తనయుడు మహతి స్వరసాగర్ ఈ మూవీకి మ్యూజిక్ అందిస్తున్నారు. మరి వాల్తేర్ వీరయ్య సినిమాతో భోళా శంకర్ మూవీపై కూడా మంచి హైప్ క్రియేట్ అవుతుంది. ఆ హైప్ ని మెహర్ రమేష్ ఏ మేరకు అందుకుంటాడు అనేది చూడాలి.


Recent Random Post: