వీడియో: బాడీ షేమింగ్ పై శర్మా గాళ్ క్లాస్


బొద్దుగా ఉన్నా ముద్దొచ్చే భామలకు కొదవేమీ లేదు. అయితే ఇలా బొద్దు అనేస్తేనే `బాడీ షేమింగ్` అంటూ అలకబూనే భామలున్నారు. ఇంతకుముందు రంగు పొంగు లేదు! గోధుమ రంగు బ్యూటీ..!! అంటూ బాలీవుడ్ స్టార్ హీరో షారూక్ వారసురాలు సుహానాఖాన్ పై కామెంట్లు చేస్తే ఆ తర్వాత సుదీర్ఘంగా క్లాస్ తీస్కున్న వైనం మరువలేం.

నమిత.. సోనాక్షి సహా చాలా మందికి బాడీ షేమింగ్ తప్పలేదు. ఇకపోతే నవతరం మోడల్ కం నటి నిఖిత శర్మ కు ఇలాంటి సమస్య ఎదురైనట్టుంది. అందుకే ఇదిగో ఇలా వీడియో సాక్షిగా క్లాస్ తీస్కుంది. ఏకంగా టేప్ పట్టుకుని కొలతలు కొలిచేస్తూ .. బరువు తగ్గాలన్న ప్రయత్నంలో బాడీని హింసించడం తనవల్ల కాదు బాబూ! అంటూ బోలెడంత కామెడీలు చేస్తోంది.దయచేసి ఈ ప్రయాణం ఇప్పటివరకూ ఎలా సాగిందో అర్థం చేసుకోవడానికి దయచేసి చివరి వరకు ఈ వీడియో చూడండి ..అంటూ ఓ వీడియోని షేర్ చేసింది నిఖిత్ శర్మ.

ఈ వీడియో నా వ్యక్తిగత అనుభవం. బాడీ షేమింగ్ .. తీవ్రమైన శారీరక గాయం విషయంలో నేను వ్యవహరించాల్సిన కొన్ని సంగతుల నుండి పుట్టిన వీడియో ఇది. ఇందులో ప్రతిదీ 100శాతం నిజం. నేను డైట్ ప్లాన్ లతో నన్ను హింసించుకున్నా. ఇతరుల వ్యాఖ్యలు నన్ను ప్రభావితం చేశాయి. అందుకే రెండేళ్లుగా శ్రమిస్తున్నా. నాకు ఇప్పుడు చాలా తక్కువ వెన్నునొప్పి ఉంది. ఎక్కువ పని చేయడం వల్ల నాకు జీవితకాలం ఉంటుంది.

కానీ తగినంతగా ఉందని నేను గ్రహించక ముందే దాదాపు 2 సంవత్సరాలు అయిపోయింది.. కానీ నేను నా స్వంత నిబంధనల ప్రకారం జీవితాన్ని ప్రారంభించాను. నేను జీవించాలనుకునే మార్గం. నా జీవితంతో నేను ఏమి చేయాలనుకుంటున్నాను అని నిర్వచించే మార్గం.. అంటూ సుదీర్ఘంగా క్లాస్ తీస్కుంది ఈ అమ్మడు.

ఇతర వ్యక్తుల మాటల విషయానికొస్తే.. నేను చెప్పినదానిని.. నన్ను నమ్మండి. ఇతరులు చెప్పేవన్నీ చెత్త కబుర్లు.. అంటూ పెద్ద క్లాసే తీస్కుంది. సెల్ఫ్ లవ్ చాలా ముఖ్యం అని కూడా చెప్పింది.


Recent Random Post: