మృణాల్ ఠాకూర్ తో వైజయంతీ లేడీ ఓరియేంటెడ్!

‘సీతారామం’ హిట్ తో మృణాల్ ఠాకూర్ ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది. సీత పాత్రలో అమ్మడు ఒదిగిపోయిన వైనం ఆద్యంతం మెప్పించింది. అచ్చంగా సీతనే దిగొచ్చిందా? అన్నంతగా ప్రేక్షకుల్ని అలరించింది.

దీంతో ఈ మరాఠీ బ్యూటీకి లేడీ ఓరియేంటెడ్ ఆఫర్లే తలుపు తడుతున్నట్లు ప్రచారం సాగుతుంది. ఒక్క హిట్ కే కథానాయిక ప్రాధాన్యం గల సినిమాలా? అని ఒకింత షాక్ అయినా నమ్మాల్సిన నిజంగానే కనిపిస్తుంది.

వాస్తవానికి సీతారామం రిలీజ్ అయిన మరుక్షణమే వెబ్ మీడియా ఈ తరహాతో కథనాలు వెడెక్కించింది. కానీ ప్రాజెక్ట్ అధికారికం కాకపోవడంతో ప్రచారంగానే మిగిలిపోయింది. అయితే తాజా అప్ డేట్ అంతకు మించి కనిపిస్తోంది. మృణాల్ తో ఏకంగా అగ్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ నే ఓ లేడీ ఓరియేంటెడ్ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది.

ప్రస్తుతం మృణాల్-నిర్మాణ సంస్థ మధ్య స్ర్కిప్ట్ చర్చలు జోరుగా సాగుతున్నాయి… వీలైనంత వేగంగా ఆ పనులు పూర్తిచేసి సినిమా ప్రారంభించాలని భావిస్తున్నారు. కొన్నాళ్లగా అశ్వీని దత్ కుమార్తెలిద్దరు సంస్థని హిట్ కంటెంట్ తో పరుగులు పెట్టిస్తోన్న సంగతి తెలిసిందే. ఆ బ్యానర్ లాక్ చేసిన స్టోరీ కి హిట్ తప్ప మరో ఆప్షన్ లేకుండా చేస్తున్నారు.

ఇదే బ్యానర్లో కొత్త వాళ్లని సైతం పరిచయం చేసి హిట్ అందుకోవడం ప్రత్యేకంగా నిలుస్తుంది. ఈనేపథ్యంలో మృణాల్ కి మరోసారి లక్కీ ఛాన్స్ దొరికిందనే చెప్పాలి. స్టోరీ సహా మేకింగ్ పరంగా నూరుశాతం సానబెట్టే కంటెంట్ ని బయటకు వదులుతారు. ఇక నిర్మాణ విలువలు గురించి చెప్పాల్సిన పనిలేదు. హై క్వాలిటీ సినిమాని అందిచడం బ్యానర్ ప్రత్యేకత.

ఇలా అన్ని రకాలుగా మృణాల్ అలియాస్ సీతకు కలిసొచ్చినట్లే. దర్శకుడు ఎవర్నది ఇంకా ఫైనల్ చేయలేదు. కొత్త వాళ్లకే అవకాశం కల్పించనున్నట్లు వినిపిస్తుంది. ప్రస్తుతం ఇదే బ్యానర్ లో భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాణం జరుగుతోన్న సంగతి తెలిసిందే. వందల కోట్ల రూపాయాలతో సినిమాలు నిర్మిస్తున్నారు. అవసరం మేర ఇతర సంస్థల భాగస్వామ్యంలోనూ నిర్మాణం చేపడుతున్నారు.


Recent Random Post: