మహానటికి అరుదైన ‘కీర్తి’.. ఆనందంలో బ్యూటీ!


సౌత్ ఇండస్ట్రీలో టాలెంటెడ్ హీరోయిన్ గా తనదైన బ్రాండ్ క్రియేట్ చేసుకుంది అందాల నటి కీర్తి సురేష్. తెలుగులో ‘నేను శైలజ’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి.. సావిత్రి బయోపిక్ ‘మహానటి’తో ఏకంగా ఉత్తమ జాతీయ నటిగా అవార్డు అందుకుంది. ప్రస్తుతం తెలుగు తమిళ భాషల్లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కంటిన్యూ అవుతోంది. తాజాగా.. అరుదైన ఘనత సాధించిందీ అమ్మడు.

ప్రస్తుతం కీర్తి సురేష్ నటించిన రెండు తెలుగు సినిమాలు రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి. అలాగే.. కోలీవుడ్లో సెల్వ రాఘవన్ తో కలిసి నటించిన ‘సానికాయుధం’ సినిమా కూడా రిలీజ్ కి సిద్ధమవుతోంది. మరో వైపు సూపర్ స్టార్ మహేష్ బాబుతో ‘సర్కారు వారి పాట’ సినిమాలోనూ చేస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే స్టార్ట్ అయ్యింది.

ఇదిలాఉంటే.. ఈ బ్యూటీ ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకుంది. గత ఏడాది ఇండియాలో అత్యంత ప్రతిభాశీలురైన నటీమణుల జాబితాను ఫోర్బ్స్ ప్రకటించింది. మొత్తం 30 మందితో కూడిన జాబితా రిలీజ్ చేయగా.. అందులో కీర్తి సురేష్ కి చోటు లభించింది.

జాతీయ అవార్డు గ్రహీతగా ఇప్పటికే ఎంతో ‘కీర్తి’ పొందిన సురేష్.. ఇప్పుడు ప్రతిష్టాత్మక గౌరవాన్ని కూడా అందుకుంది. 2020 సంవత్సరానికి గానూ ఫోర్బ్స్ ఈ జాబితాను రిలీజ్ చేసింది. ఈ లిస్టులో సౌత్ ఇండియాను కీర్తికి మాత్రమే చోటు దక్కడం విశేషం. ప్రతీ సంవత్సరం ఫోర్బ్స్ దేశవ్యాప్తంగా సర్వే నిర్వహిస్తుంది. ఆన్లైన్ ద్వారా అప్లికేషన్స్ జ్యూరీ సిఫార్సులు రిసీవ్ చేసుకుంటుంది. ఈ విధంగా మూడు దశల వడపోత అనంతరం ఫైనల్ జాబితాను సిద్ధం చేస్తుంది.

ఫోర్బ్స్ జాబితాలో తన పేరు ఉండటంపై కీర్తి సురేష్ ఆనందం వ్యక్తం చేసింది. ఈ మేరకు ట్వీట్ చేసిన సుందరి.. విభిన్న పాత్రలతో ప్రయాణం చేస్తున్నందుకు తనకి దక్కిన గౌరవంగా భావిస్తున్నానని పేర్కొంది. దీంతో.. కీర్తి సురేష్ కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.


Recent Random Post: