మండుతున్న టైమ్ లో.. బిజీబిజీగా తారక్

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టైన టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు వివిధ పార్టీలు, వ్యక్తుల నుంచి సంఘీభావం వ్యక్తమవుతోంది. నారా కుటుంబం, నందమూరి కుటుంబమంతా చంద్రబాబుకు మద్దతుగా నిలుస్తూ ఏపీ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. కానీ నందమూరి మూడో తరం ధ్వజ స్తంభమైన యంగ్​ టైగర్​ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం మౌనం పాటిస్తున్నారు. దీనిపై ఫ్యాన్స్ భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తం చేస్తున్నారు.

అయితే మౌనం పాటిస్తున్న ఎన్టీఆర్​.. ఇప్పుడు సైలెంట్​గా మరో పని చేశారు. అదేంటంటే.. దేవర షూటింగ్​లో పాల్గొన్నారట. తాజాగా ఈ విషయం బయటకు వచ్చింది. నందమూరి-నారా కుటంబంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు అరెస్ట్ వివాదం పెద్ద ఎత్తున సాగుతుంటే తారక్ మాత్రం సైలెంట్​గా తన కెరీర్​కు సంబంధించి ఫోకస్ పెడుతూ షూటింగ్​లో బిజీ అయ్యారట.

ఈ విషయంపై కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఎన్టీఆర్​ ఎందుకు మౌనంగా ఉంటున్నారా తెలీక అభిమానులు తికమకపడుతున్నారు. తారక్​ తన ఇన్​ఫ్లుయెన్స్​ను ఉపయోగించి ఏదో ఒకటి చేయాలని కోరుతున్నారు. మరికొంతమంది మౌనం పాటించడంపై తారక్​ను విమర్శిస్తున్నారు. ఇంకొందరు మాత్రం ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. ఎన్టీఆర్​ మెచ్యూరిటీగా వ్యవహరిస్తున్నారని, అనవసరంగా రాజకీయాల్లో వేలు పెట్టడం మంచిది కాదని అంటున్నారు. చూడాలి మరి తారక్​ తర్వాతైనా ఏమైనా మాట్లాడతారా లేదా అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

ఇక దేవర విషయానికొస్తే.. దర్శకుడు కొరటాల శివ దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలోని నటీనటుల లుక్స్‌, పోస్టర్స్​తో అభిమానుల్లో అంచనాలు పెంచేశారు మేకర్స్​. యాక్షన్​కు పెద్ద పీట వేస్తూ సినిమాను రూపొందిస్తున్నారు. హాలీవుడ్‌ టెక్నిషియన్స్​ ఈ చిత్రం కోసం పనిచేయడం విశేషం. సీ(సముద్రం) కాన్సెప్ట్​ నేపథ్యంలో రానున్న ఈ చిత్రంలో అండర్ వాటర్‌ ఫైటింగ్‌ యాక్షన్ సీక్వెన్స్​ కూడా అందట.

ఇది ఎన్టీఆర్‌ 30వ సినిమాగా రానుంది. తారక్​ సరసన జాన్వీ కపూర్‌ నటిస్తోంది. ప్రతినాయకుడి పాత్రలో సైఫ్‌ అలీఖాన్ నటిస్తున్నారు. ఎన్టీఆర్‌కు అత్త పాత్రలో సీనియర్ హీరోయిన్‌ రమ్యకృష్ణ కనిపించనుందని అంటున్నారు. అనిరుధ్‌ స్వరాలు అందిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్‌ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.


Recent Random Post: