‘బోల్డ్ నెస్’తో అల్లాడించిన సామ్.. ఫ్యామిలీ మ్యాన్-2లో ‘సెంటర్ ఆఫ్ అట్రాక్షన్’..!


సౌత్ స్టార్ హీరోయిన్ అక్కినేని సమంత.. తాజాగా ‘ఫ్యామిలీ మ్యాన్’ సెకండ్ సీజన్ వెబ్ సిరీస్ తో డిజిటల్ ఎంట్రీ చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ గురించి మాట్లాడుకోవాలి అంటే ఖచ్చితంగా సమంత టాపిక్ లేకుండా ఏ వార్త వినిపించడం లేదు. ఎందుకంటే ఫస్ట్ టైం సమంత అవుట్ ఆఫ్ ది బాక్స్ నటించిన బోల్డ్ క్యారెక్టర్ కావడంతో ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చనీయంశంగా మారింది. అసలు ఏం మాయచేసావే సినిమాతో డెబ్యూ చేసినటువంటి సమంతను దృష్టిలో పెట్టుకుంటే ఫ్యామిలీ మ్యాన్ లో సమంత మాత్రం ఖచ్చితంగా షాకిస్తుంది అనే చెప్పాలి.

సమంత ఇంతవరకు ఎవరు ఊహించని రేంజిలో బోల్డ్ నెస్ కనబరిచింది. అందులోను ఇంతవరకు ఆమెను చూడని కంప్లీట్ డిఫరెంట్ రోల్ చేయడం విశేషం. ఎప్పటినుండో సమంత డిజిటల్ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు సామ్ దిమ్మతిరిగే రేంజిలో బోల్డ్ రోల్ పోషించింది. ముఖ్యంగా ఈ వెబ్ సిరీస్ లో కొన్ని సన్నివేశాలు సామ్ నుండి ఎక్సపెక్ట్ చేయనివి చాలా ఉన్నాయి. మరి ఎలా అంగీకరించిందో కానీ యాక్షన్ మాత్రం అదరగొట్టింది. ఆమె వెబ్ సిరీస్ ప్రారంభంలో చెప్పినట్లుగానే ఫేవరేట్ నెగటివ్ బోల్డ్ రోల్.. అని నిరూపించింది. నిజానికి సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ కెరీర్ ప్రారంభంలో గ్లామరస్ బోల్డ్ రోల్స్ చేస్తుంటారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో మార్పుల దృష్ట్యా ఏ వయసులో అయినా బోల్డ్ రోల్స్ చేసేయొచ్చని రెడీ అయిపోతున్నారు.

అయితే సమంత కెరీర్ ప్రారంభంలో గ్లామర్ రోల్స్ చేసింది కానీ మరీ ఇంత బోల్డ్ రోల్ చేయలేదు. సాధారణంగా హీరోయిన్స్ పెళ్లికి ముందే ఇలాంటి బోల్డ్ అండ్ హాట్ రోల్స్ లో కనిపిస్తారు. పెళ్లి అయిపోయాక రొమాంటిక్ రోల్స్ తగ్గించేస్తారు. కానీ సమంత అలాంటి వారికీ డిఫరెంట్ గా వెళుతోంది. సామ్ పెళ్లికి వరకు డీసెంట్ గ్లామరస్ రోల్స్ చేసింది. పెళ్లి తర్వాత ‘సూపర్ డీలక్స్’ సినిమాతో షాకిచ్చింది. ఇప్పుడు ఫ్యామిలీ మ్యాన్ తో ఒక్కసారిగా బిగ్ షాక్ అండ్ సర్ప్రైజ్ ఇచ్చిందనే చెప్పాలి. అయితే ఈ సిరీస్ లో సామ్ క్యారెక్టర్ డిమాండ్ మేరకే ఆ రేంజిలో బోల్డ్ సన్నివేశాలలో నటించినట్లు అర్ధమవుతుంది. అందులోనూ చాలా బరువైన క్యారెక్టర్ పోషించి మంచి పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంటుంది. చాలకాలం తర్వాత సమంత నుండి మైండ్ బ్లోయింగ్ రోల్ కనిపించడంతో ఫ్యాన్స్ – ట్రోలర్స్ కూడా ఖుషీ అవుతున్నారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం సామ్ ‘కాతువకుల రెండు కాదల్’ ‘శాకుంతలం’ సినిమాల్లో నటిస్తోంది.


Recent Random Post: