పిక్ టాక్ : మాస్ పుష్ప తో క్యూట్ అర్హ చెస్

అల్లు అర్జున్ మరియు ఆయన కూతురు అల్లు అర్హ ల యొక్క ఫోటోలు మరియు వీడియోలు రెగ్యులర్ గా ఈ మధ్య వైరల్ అవుతున్నాయి. గతంలో మహేష్ బాబు కూతురు సితార గురించి సోషల్ మీడియాలో ఏ స్థాయిలో చర్చ జరిగేదో ఇప్పుడు అల్లు అర్హ గురించి అంతకు మించి అన్నట్లుగా చర్చ జరుగుతుంది.

తండ్రి అల్లు అర్జున్ తో రెగ్యులర్ గా సోషల్ మీడియాలో సందడి చేసే అర్హ ఇటీవలే తండ్రికి ఒక తెలుగు పద్యం చెప్పిన వీడియో వైరల్ అయ్యింది. ఇంతలోనే ఈ ఫోటోతో నెట్టింట సందడి చేస్తోంది.

అల్లు అర్హ మరియు అల్లు అర్జున్ ల యొక్క ఈ ఫోటో ను చూసి సినీ వర్గాల వారు కూడా క్యూట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

సినిమాలతో బిజీగా ఉన్నా కూడా అర్హ తో సాధ్యం అయినంత ఎక్కువ సమయం ను అల్లు అర్జున్ గడిపేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటాడు.

ఆయన హీరోగా నటించబోతున్న పుష్ప 2 కి సంబంధించిన వర్క్ ప్రస్తుతం జరుగుతుంది. అయినా కూడా కూతురుతో ఇలా రిలాక్స్ గా చెస్ ఆడుకుంటూ.. కూతురుకు చెస్ నేర్పిస్తూ బన్నీ ఆమెతో టైమ్ గడుపుతున్నాడు.

క్యూట్ అర్హతో మాస్ పుష్ప రాజ్ చెస్ ఆడుతున్నాడు అంటూ ఈ ఫోటోను జనాలు తెగ కామెంట్స్ చేస్తూ షేర్ చేస్తున్నారు. ముందు ముందు అల్లు అర్హ హీరోయిన్ గా నటించాలని ఇప్పటి నుండే కొందరు కోరుకుంటూ ఉన్నారు. శాకుంతలం సినిమాలో ఒక కీలక పాత్రలో అల్లు అర్హ కనిపించబోతున్న విషయం తెల్సిందే.


Recent Random Post: