నాగార్జునని టార్గెట్ చేసిన బాలకృష్ణ!?

నందమూరి బాలకృష్ణ స్టేజ్ పైకి వెళ్లి మైక్ పట్టుకున్నాడంటే ఆయన ప్రసంగం ఎటు నుంచి ఎటు వెళుతుందో ఎవరూ అంచనా వేయలేరు. విచిత్రం ఏంటంటే బాలకృష్ణ కూడా అంచనా వేయలేడు. అంతా సాగుతుంటుంది ఆయన ప్రసంగం. సినిమా ఫంక్షన్ లలోనూ అదే తంతు.. పబ్లిక్ మీటింగ్ లు రాజకీయ ప్రచార సభల్లోనూ బాలయ్య ప్రసంగం తీరు మారదనే కామెంట్ లు గత కొన్నేళ్లుగా వినిపిస్తూనే వున్నాయి. ఇది ఇండస్ట్రీ వాళ్లకు బాగా సుపరిచితమే.

బాలయ్య మైక్ పట్టుకున్నాడంటే ఆరోజుల్లో నాన్నగారు అంటూ ఎటు నుంచి ఎటు టాపిక్ ని మళ్లిస్తారో.. చివరికి ఎలా ముగిస్తారో ఎవరికీ అంతు చిక్కదు. చాలా వేదికలపై ఆయన మాట్లాడిన తీరు పలు వివాదాలకు దారి తీయడం మహిళా సంఘాలు ధర్నాలకు దిగడం తెలిసిందే. ఓ సినిమా ఫంక్షన్ లో మహిళలపై బాలయ్య చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెను దుమారమే సృష్టించాయి. ఇదిలా వుంటే ‘వీర సింహారెడ్డి’ విజయోత్సవం వేదికగా బాలకృష్ణ తాజాగా అదే తరమా వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది.

వివరాల్లోకి వెళితే.. నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన యాక్షన్ ఎంటర్ టైనర్ ‘వీర సింహారెడ్డి’. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ వారు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ మూవీ సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకొచ్చింది. సంక్రాంతి సినిమాల్లో ‘వీర సింహారెడ్డి’కి మంచి ఆదరణ దక్కడంతో మేకర్స్ హైదరాబాద్ లో మేకర్స్ భారీగా విజయోత్సవాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో యమ జోష్ తో పాల్గొన్న బాలయ్య స్టేజ్ పై మాట్లాడుతూ.. సింగర్స్ తో కలిసి పాటలు పాడుతూ హుషారుగా కనిపించారు. ఆ తరువాత మైక్ అందుకుని మాట్లాడటం మొదలు పెట్టిన బాలయ్య సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికి అభినందలు తెలియజేశారు. అంతే కాకుండా తండ్రి స్వర్గీయ నందమూరి తారక రామారావుని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా స్టేజ్ పై వున్న నిర్మాతలతో చతుర్లాడిన బాలయ్య వారికి సినిమా అంటే వున్న ప్యాషన్ ని గుర్తు చేశారు.

అక్కడితో ఆగక పక్కన ఎవరి గురించో మాట్లాడుతూ వెళ్లి ఈయన వున్నాడంటే సెట్ లో ఏదో ఒకటి.. అంటూ ఆ రోజుల్లో మీ నాన్నాగారి గురించి.. ఆ రంగారావు.. ఈ రంగారావు.. అక్కినేని.. తొక్కినేని..’ అంటూ టంగ్ స్లిప్పయ్యారు. దీనిపై సోషల్ మీడియాలో ప్రస్తుతం నెటిజన్ లు కామెంట్ లు చేస్తున్నారు.

అనుకోకుండా ఆ మాటలు వచ్చాయా?.. నోరు జారి వచ్చాయా?.. జగన్ కు నాగార్జున సపోర్ట్ గా వున్నారని వచ్చాయా?.. యావరేజ్ సినిమా హిట్ అనే సెల్ప్ ఆనందంతో వచ్చాయా?.. అక్కినేని తొక్కినేని అని పెద్ద మాట అన్నాడు అంటే వెనుక ఏదో వున్నది అన్నమాట.. బాలకృష్ణ అంత ఆవేశం మాటలు టీడీపీకి మైనస్ అయ్యే అవకాశం వుందని టీడీపీ వర్గాల ఇన్ సైడ్ టాక్.


Recent Random Post: