న‌ట‌సింహం వ్య‌క్తిత్వాన్ని పోలిన లేడీ న‌టి!

న‌ట‌సింహ బాల‌కృష్ణ సినిమాల్లో అత‌ని పాత్ర ఏ రేంజ్ లో హైలైట్ అవుతుందో చెప్పాల్సిన ప‌నిలేదు. ధ‌ర్మం-అధ‌ర్మం మ‌ధ్య బాల‌య్య చేసే పోరాటాన్ని ఓ రేంజ్ లో హైలైట్ చేయ‌డం అన్న‌ది బోయ‌పాటికే చెల్లింది. బాల‌య్య ని అతి ద‌గ్గ‌ర‌గా చూసి ద‌ర్శ‌కుడు కావ‌డంతో అత‌ని వ్య‌క్తిత్వాన్ని ఆధారంగా చేసుకుని బాయ‌ల్య లో సెకెండ్ యాంగిల్ ని ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం చేసిన ఘ‌న‌త ఆయ‌న‌ది.

అంత‌కు ముందు సీమ బ్యాక్ డ్రాప్ లో చేసిన కొన్ని చిత్రాల్లోనూ బాల‌య్య లో ల‌క్ష‌ణాల్ని పాక్షికంగా ట‌చ్ చేసిన ద‌ర్శ‌కులెంతో మంది. ముఖ్యంగా బాల‌య్య పాత్ర మ‌హిళ ప‌ట్ల ఎలా ఉంటుంద‌న్న‌ది? బోయ‌పాటి సింహ‌, లెజెండ్ లాంటి చిత్రాల్లో ఎంతో గొప్ప‌గా చూపించారు. తాజాగా బాల‌య్య వ్య‌క్తిత్వానికి ద‌గ్గ‌ర‌గా నా పాత్ర ఉంటుందంటూ వ‌ర్ద‌మాన న‌టి మాల్వీ మ‌ల్హోత్రా ముందుకొచ్చింది.

రాజ్ త‌రుణ్ హీరోగా న‌టిస్తోన్న ‘తిర‌గ‌బ‌డ‌ర సామీ’ చిత్రంతో అమ్మ‌డు టాలీవుడ్ లో లాంచ్ అవుతుంది. త్వ‌ర‌లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సంద‌ర్భంగా త‌న పాత్ర గురించి చెబుతూ బాల‌య్య అంశాన్ని ట‌చ్ చేసింది. ‘సినిమాలో నా పాత్ర బాల‌కృష్ణ గారి వ్య‌క్తిత్వాన్ని పోలి ఉంటుంది. చిత్రంలో మ‌హిళ‌ల‌కు ఆత్మ‌ర‌క్ష‌ణ నేర్పించే పాత్ర‌లో క‌నిపిస్తా. ఇలాంటి పాత్ర‌లో బాల‌కృష్ణ గారు ఎంతో గొప్పగా న‌టించారు.

ఆ సినిమాలు చూసాను. ఇప్పుడ‌దే పాత్ర నాకు రావ‌డం ల‌క్కీగా భావిస్తున్నాను. ఇందులో కొన్ని యాక్ష‌న్ స‌న్నివేశాలు కూడా చేసాను’ అని అంది. ఇక అమ్మ‌డిది హిమాచ‌ల్ ప్ర‌దేశ్. చ‌దువు కోసం ముంబై వెళ్లింది. అక్క‌డ థియేట‌ర్ ఆర్స్ట్ లో చేరింది. అటుపై టీవీ ప‌రిశ్ర‌మ నుంచి సినిమాల్లోకి వ‌చ్చింది. హిందీ, త‌మిళ‌, మ‌ల‌యాళ చిత్రాల్లోనూ ప‌నిచేసాను. కానీ రాజ‌మౌళి సినిమాలో న‌టించాల‌న్న‌ది నా క‌ల‌. అలాగే మ‌ణిర‌త్నం లాంటి గ్రేట్ డైరెక్ట‌ర్ తో ప‌నిచేయాల‌ని ఉంది’ అని తెలిపింది.


Recent Random Post: