తోడు దొంగలు కలిసే ఇలా దోపిడీకి వెళ్లారు!


దోచేయ్.. దొరికింది దోచేయ్.. దొరికినంతా నిలువు దోపిడీ చేసేయ్..! ఇదీ నేటితరం అందాల భామల పంథా. కుర్రకారును ఏదో రకంగా దోపిడీ చేయడమే కొంటె భామల ఎజెండా. దానికోసం రకరకాల ఎత్తుగడలు వేస్తున్నారు. ఇదిగో ఇక్కడ చూస్తున్న ఈ భామలు ఇలాంటి వేషాల్లో డబుల్ పీహెచ్ డీలు.. పీజీ డిగ్రీలు పూర్తి చేశారంటే అతిశయోక్తి కాదు.

ఏం చేస్తే బోయ్స్ ని అట్రాక్ట్ చేయొచ్చో వీళ్లకు తెలిసినంతగా వేరొకరికి తెలీదు మరి. ఆ విషయం మరోసారి ప్రూవ్ చేస్తూ ఇదిగో ఇలా ముంబై వీధుల్లో ప్రత్యక్షమయ్యారు తోడు దొంగల్లా. ఇంతకీ ఈ ఇద్దరూ ఎవరో పరిచయం చేయాలా? అందాల రకుల్ ప్రీత్.. హాటెస్ట్ ప్రగ్యా జైశ్వాల్.

గత కొంతకాలంగా ఏదో తేడా కొడుతోంది! అనుకున్న వాళ్లకు దిమ్మతిరిగే ట్రీటిస్తూ ముంబైలోని ఓ రెస్టారెంట్ కి కలిసే డిన్నర్ కి వెళ్లారు ఇలా. వ్వాట్.. అలా పైన లాంగ్ నైట్ డ్రెస్ ధరించారు సరే.. ఆ కింద మర్చిపోయారా? అయినా అలా అంత ఆదమరుపుగా వీధుల్లోకి వచ్చేస్తే ఎలా? అంటూ కుర్రాళ్లు ఒకటే పరేషాన్ అయిపోతున్నారు మరి. డిన్నర్ పేరుతో అలా ముంబైలో నిలువు దోపిడీ చేయడం తగునా? అని కొందరైతే మరీ ఇదైపోతున్నారు! అన్నట్టు రకుల్ .. ప్రగ్య ఇద్దరూ బాలీవుడ్ సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయారు. ఇప్పుడు కలిసే అక్కడ పెద్ద ప్లాన్ తో ఉన్నారన్న టాక్ టాలీవుడ్ లో వేడెక్కించేస్తోంది. దేవగన్ కాంపౌండ్ లో రకుల్.. సల్మాన్ కాంపౌండ్ లో ప్రగ్య అడుగు పెట్టి కెరీర్ ని పరుగులు పెట్టించే ప్లాన్ తో ఉండడంతో ఈ అమ్మళ్లు ఆడిందే ఆట పాడిందే పాట కానుందన్న గుసగుసా వైరల్ గా మారింది మరి.


Recent Random Post: