డార్లింగ్ కోసం రంగంలోకి ఆ డైరెక్టర్!

టాలీవుడ్ నటుడు కమ్ కమెడియన్ ప్రియదర్శి, ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్.. హీరోహీరోయిన్లుగా డార్లింగ్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. డైరెక్టర్ అశ్విన్ రామ్.. దర్శకత్వంలో రూపొందుతున్న ఆ సినిమా.. కామెడీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఆ చిత్రం.. మరికొద్ది రోజుల్లో థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటి వరకు డార్లింగ్ మూవీ నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి.

మూవీపై ఆడియన్స్ లో సూపర్ బజ్ క్రియేట్ చేశాయి. ఇక ట్రైలర్ రిలీజ్ అయ్యాక.. సినీ ప్రియుల్లో అంచనాలు భారీగా పెరిగాయి. పెళ్లి అయ్యాక పారిస్ వెళ్లాలనుకునే హీరో.. స్ప్లిట్ మైండ్ సెట్ తో అపరిచితురాలుగా ప్రవర్తించే హీరోయిన్.. ఈ రెండు అంశాలతో ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. దీంతో చిత్రం కొత్త కాన్సెప్ట్ తో క్రేజీగా ఉండనుందని అంతా అంటున్నారు. అయితే రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న కొద్దీ.. మేకర్స్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచుతున్నారు.

ఇప్పుడు ఈ సినిమా కోసం మేకర్స్.. జాతిరత్నాలు ఫేమ్ డైరెక్టర్ అనుదీప్ ను రంగంలోకి దించారు. అయితే జాతి రత్నాలు మూవీతో ప్రియదర్శి.. మంచి హిట్ అందుకున్న విషయం తెలిసిందే. వల్గారిటీ లేని ప్యూర్ కామెడీతో సినీ ప్రియులను ఓ రేంజ్ లో నవ్వించారు అనుదీప్. అయితే ఆయన.. సినిమాల ఈవెంట్స్ లో ఎక్కువగా సందడి చేస్తుంటారు. నటీనటులకు ఇంటర్వ్యూలు కూడా చేస్తుంటారు.

అవి సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. ముఖ్యంగా ఏ ఇంటర్వ్యూలోనైనా అనుదీప్.. తన పంచులతో నవ్విస్తుంటారు. కూల్ గా మాట్లాడుతూనే అలరిస్తుంటారు. దాని ద్వారా మూవీపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. అయితే ప్రియదర్శి కామెడీ టైమింగ్ గురించి కూడా తెలిసిందే. దీంతో డార్లింగ్ టీమ్ తో అనుదీప్ ప్రమోషన్స్ అంటే.. ఎలా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు! అందుకు సంబంధించిన ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియా లో ఫుల్ వైరల్ గా మారింది.

అందులో అనుదీప్.. కామెడీకి అంతా అట్రాక్ట్ అవుతున్నారు. ఫుల్ వీడియో కోసం వెయిట్ చేస్తున్నట్లు చెబుతున్నారు. మరికొన్ని గంటల్లో ఫుల్ ప్రమోషనల్ వీడియో కూడా రానుంది. అయితే హనుమాన్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నిరంజన్ రెడ్డి.. నిర్మిస్తున్న డార్లింగ్ సినిమా ఎలాంటి హిట్ అవుతుందో చూడాలి.


Recent Random Post: