డార్లింగ్ ఒకేసారి రెండింటిని బాలన్స్ చేయనున్నాడా..??


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో సలార్ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే సలార్ మూవీ షూటింగ్ పూజా కార్యక్రమంతో సంక్రాంతి టైంలో ప్రారంభించారు మేకర్స్. ప్రస్తుతం గోదావరిఖని బొగ్గు గనులలో సలార్ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. భారీ యాక్షన్ ప్రధానంగా తెరకెక్కుతున్న ఈ సినిమా పై ప్రేక్షకులలో అంచనాలు మాత్రం ఆకాశాన్ని తాకుతున్నాయి. ఎందుకంటే ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ పై క్రేజ్ దేశవ్యాప్తంగా పాకేసింది. అయితే తాజాగా ఈ సినిమా గురించి క్రేజీ న్యూస్ వినిపిస్తుంది. ప్రభాస్ ఇకనుండి ఒకేసారి రెండు సినిమాలకు టైం కేటాయించనున్నాడు. ఓవైపు సలార్ లో నటిస్తూనే మరోవైపు ఆదిపురుష్ లైన్ లో పెట్టాడు.

తాజాగా ఈ రెండు సినిమాలకు నెలలో పదిహేను రోజులు సలార్ తర్వాత పదిహేను రోజులు ఆదిపురుష్ సినిమాకు కేటాయిస్తున్నాడు. భారీ అంచనాలు క్రియేట్ చేసిన ఈ గ్యాంగ్ స్టర్ మూవీ షూటింగ్ గతవారం మొదలైంది. ప్రస్తుతం సలార్ షెడ్యూల్ మరో పదిరోజులు కొనసాగుతుంది. అయితే ఇదే సమయంలో ప్రభాస్ ఆదిపురుష్ మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నాడు. ముంబైలో ఇటీవలే ఆదిపురుష్ షూటింగ్ పనులు ప్రారంభమయ్యాయి. సలార్ షెడ్యూల్ ముగించిన వెంటనే ప్రభాస్ ముంబై వెళ్లి ఆదిపురుష్ సెట్ లో పాల్గొంటాడట. ఇక సలార్ ఈ ఏడాది ద్వితీయార్థంలో విడుదల కాబోతుండగా.. ఆదిపురుష్ వచ్చే ఏడాది ఆగష్టులో విడుదల కానుందని సమాచారం. ఇదిలా ఉండగా.. ప్రభాస్ పూజాహెగ్డే కాంబినేషన్ లో తెరకెక్కిన రాధేశ్యామ్ త్వరలో విడుదల కాబోతుంది.


Recent Random Post: