జూన్ అంతా విరామంలోనే శర్వానంద్!

యంగ్ హీరో శర్వానంద్ వివాహం జూన్ 3 నిశ్చయించిన సంగతి తెలిసిందే. రాజస్థాన్లోని జైపూర్ అందుకు వేదిక అయింది. రెండు రోజుల పాటు ఈ వివాహ వేడుక వైభవంగా జరుగుతుంది. జూన్ 2న మెహందీ ఫంక్షన్..మరుసటి రోజున పెళ్లికొడుకు ఫంక్షన్ జరుగుతుంది. ఈ వేడుక నిరాడంబరంగా జరుగుతోంది. కేవలం హైదరాబాద్లో ఇరు కుటుంబ సభ్యులు- ముఖ్యమైన స్నేహితులు- కొంత మంది సినీ ప్రముఖుల హాజరవుతారని తెలుస్తోంది.

శర్వానంద్ కి క్లోజ్ గా ఉండే రామ్ చరణ్-రానా ఈవేడుకకు హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. పెళ్లికి రెండు వారాలు కూడా సమయం లేకపోవడంతో పెళ్లి పనులు అప్పుడే మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఓవైపు శర్వానంద్ తన 30వ సినిమా షూటింగ్ లో బిజీగా ఉంటూనే పెళ్లి పనులు చూసుకుంటున్నాడు. అయితే ఈనెల 25 నుంచి పూర్తిగా షూటింగ్ నుంచి సెలవు తీసుకుంటాడని సమాచారం.

దాదాపు నెల రోజుల పాటు ఎలాంటి షూటింగ్ లు..ఇతర పనులు పెట్టుకోకుండా పెళ్లి పనులు…హనీమూన్ పనిలోనే బిజీగా ఉంటాడని సన్నిహిత వర్గాల సమాచారం. జూన్ 3న వివాహం అనంతరం హైదరాబాద్ లో రిసెప్సన్ అనంతరం విదేశాలకు హనీమూన్ కి పయనం కానున్నాడుట. ఉన్న సమయంలోనే వీలైనన్ని ప్రదేశాలు చుట్టేయాలని ప్లాన్ చేస్తున్నాడుట. ఈ టూర్ మొత్తం మూడు వారాలకు పైగా ఉంటుందని సమాచారం.

సతీమణితో అందమైన ప్రదేశాల్ని చుట్టేయనున్నాడని తెలుస్తోంది. శర్వానంద్ విదేశీ వెకేషన్లకు వెళ్లడం చాలా రేర్. బ్యాచ్ లర్ గా ఉన్నంత కాలం సినిమాలతోనే గడిపాడు. ఉంటే సినిమా సెట్స్ లో ఉండేవారు. లేదంటూ హైదరాబాద్ లో ఇంట్లోనే ఉండేవారు. విదేశాలు తిరగడం..స్నేహితులతో షికార్లు వంటి విషయాల్లో ఎప్పుడూ మీడియా కంట పడింది లేదు. కొత్తగా ఇప్పుడు జీవిత భాగస్వామి వస్తుంది కాబట్టి ఇకపై శర్వా లైఫ్ స్టైల్ కూడా మారే అవకాశం ఉంది. పెళ్లైన తర్వాత బన్నీ..రామ్ చరుణ్…రానా ఎంతగా మారిపోయారో తెలిసిందే.


Recent Random Post: