గుసగుస: గుసగుస: చరణ్ -శంకర్ సినిమాలో మెగాస్టార్?


మెగాస్టార్ చిరంజీవి .. స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ సినిమా కోసం మెగాభిమానులు చాలా కాలంగా వేచి చూస్తున్న సంగతి తెలిసిందే. పలుమార్లు సోషల్ మీడియాల్లో దీనిపై చిరు ఫ్యాన్స్ అభ్యర్థించిన సంగతి తెలిసిందే. చిరంజీవి సైతం శంకర్ దర్శకత్వంలో నటించే అవకాశం కోసం చాలా ఆసక్తిగానే వేచి చూశారు. రోబో చిత్రీకరణ సమయంలో చిరంజీవి బహిరంగంగానే శంకర్ తో పని చేసేందుకు వేచి చూస్తున్నానని అన్నారు. కానీ అది ఎప్పటికీ సాధ్యపడలేదు. కానీ కోలీవుడ్ నుంచి అందిన సమాచారం మేరకు మెగాస్టార్ చిరంజీవి- శంకర్ కాంబినేషన్ పాజిబుల్ అవుతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇంతకుముందు శంకర్ తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ మూవీ జెంటిల్ మేన్ ని హిందీలో ది జెంటిల్ మేన్ పేరుతో చిరంజీవి కథానాయకుడిగా రీమేక్ చేశారు. కానీ హిందీ వెర్షన్ కి శంకర్ దర్శకత్వం వహించలేదు. ఇక ఇంతకాలానికి చిరంజీవి వారసుడు రామ్ చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో సినిమా తెరకెక్కనుండడం ఆసక్తిగా మారింది. ఇది ఓ పొలిటికల్ కాన్సెప్ట్ తో తెరకెక్కనుంది. సీఎంగా ఎదిగిన ఓ యువ ఐఏఎస్ అధికారి కథాంశంతో ఆద్యంతం పొలిటికల్ థ్రిల్లర్ గా రక్తి కట్టించే స్క్రీన్ ప్లేతో విజువల్ గ్రాండియర్ గా తెరకెక్కించేందుకు శంకర్ సన్నాహకాల్లో ఉన్నారు. దీనికి నిర్మాత దిల్ రాజు భారీ పెట్టుబడుల్ని సమీకరించే పనిలో ఉన్నారని కథనాలొస్తున్నాయి.

ఇక లైకాతో శంకర్ వివాదాల వల్ల ప్రాజెక్ట్ ఆలస్యమవుతోందని.. అయినా శంకర్ మాత్రం చరణ్ తో సినిమాని పూర్తి చేసేందుకు పట్టుదలగా ఉన్నారని కథనాలొస్తున్నాయి. ఆసక్తికరంగా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో చిరంజీవి నటించే అవకాశం ఉందన్న గుసగుసా తాజాగా వినిపిస్తోంది. అసలు ఇది నిజమేనా.. నిజమే అయితే ఇది కీలక పాత్రనా.. లేక అతిథి పాత్రనా అన్నదానిపైనా సరైన స్పష్ఠత లేదు.

ఓవైపు చిరు-చరణ్ కాంబినేషన్ ఇటీవల హాట్ టాపిక్ గా మారుతోంది. మగధీరలో బంగారు కోడిపెట్ట సాంగ్ లో చిరు మెరుపులా మెరవగా బ్రూస్ లీ చిత్రంలో చిరు -చరణ్ జోడీ కొన్ని సీన్లలో కనిపించారు. ఇప్పుడు చిరంజీవి నటిస్తున్న ఆచార్యలో చరణ్ 40 నిమిషాల నిడివి ఉన్న పాత్రలో కనిపిస్తున్నారు. ఇక శంకర్ – చరణ్ సినిమాలో చిరు కూడా అంతే ఆసక్తికర పాత్రలో నటిస్తారా? అన్నది ఆసక్తిగా మారింది. ఒకవేళ ఇదే నిజమైతే తండ్రి కొడుకుల్ని శంకర్ ఏ రేంజులో చూపిస్తారు? అన్నది మెగాభిమానుల్లో పెద్ద డిబేట్ కి తెర తీయడం ఖాయంగా కనిపిస్తోంది.


Recent Random Post: