గుర్తు పట్టగలరా.. తెలుగులో మోస్ట్ పాపులర్ సెలబ్రెటీస్


ఈ ఫొటోలో ఉన్న ఇద్దరు పిల్లలను మీరు గుర్తు పట్టగలరా.. ఎక్కడో చూసినట్లుగా అనిపిస్తూ ఉంది కదా. అవును వీరిద్దరు కూడా టాలీవుడ్ లో ప్రస్తుతం మోస్ట్ పాపులర్ సెలబ్రెటీస్. ముఖ్యంగా ఆ బుడ్డోడు టాలీవుడ్ సూపర్ స్టార్. ఇక ఆ పాప ఆ బుడ్డోడి అక్క. వీరిద్దరు ఒక స్టార్ హీరో పిల్లలు. ఇప్పటికే వీరు ఎవరో గుర్తు పట్టి ఉంటారు. ఔను వీరిద్దరు కూడా మెగాస్టార్ చిరంజీవి ముద్దుల పిల్లలు అయిన సుష్మిత మరియు చరణ్. సుష్మిత ఈ ఫొటోను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. గుర్తు పట్టండి అంటూ ఆమె ఈ ఫొటోను షేర్ చేసి తమ్ముడు చరణ్ పై తనకున్న అభిమానంను చాటుకుంది.

సుష్మిత కూడా ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీ బిజీగా గడుపుతున్నారు. తన తండ్రి మరియు తమ్మడు నటిస్తున్న సినిమాలతో పాటు మరికొన్ని సినిమాలకు కూడా ప్రత్యేకంగా కాస్ట్యూమ్స్ డిజైనర్ గా వ్యవహరిస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో ఆమె తనవంతు పాత్రను పోషిస్తున్నారు. ఖైదీ నెం.150 నుండి మొదలుకుని సుష్మిత కాస్ట్యూమ్స్ డిజైనర్ గా తన సినీ ప్రస్థానంను కంటిన్యూ చేస్తున్నారు. సైరా సినిమాలో ఆమె చక్కటి ప్రతిభ కనబర్చి పాత్రలకు తగ్గట్లుగా చక్కని కాస్ట్యూమ్స్ ను డిజైన్ చేయడం జరిగింది.

ప్రస్తుతం ఆచార్య సినిమా కోసం కూడా ఆమె కాస్ట్యూమ్స్ డిజైనర్ గా వర్క్ చేస్తున్నారు. షూటింగ్ లో తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటే ఎప్పటికప్పుడు తండ్రి ని చూసుకుంటూ ఉన్న సుష్మిత సోషల్ మీడియాలో రెగ్యులర్ గా పోస్ట్ లు పెడుతూ తన వృతిపరమైన మరియు వ్యక్తిగతమైన విషయాలను షేర్ చేసుకుంటూ ఉంటారు. ఇన్ స్టాగ్రామ్ లో మీ చిన్నప్పటి ఫొటో అంటూ అభిమానులు అడిగిన సమయంలో ఈ ఫొటోను షేర్ చేసింది. ఫొటోను షేర్ చేసి ఎవరో గుర్తు పట్టారా అంటూ కామెంట్ పెట్టింది.


Recent Random Post: