కంగనాకు ఘోర అవమానం.. 20 టికెట్లు మాత్రమే సేల్..!


సినిమా మార్కెట్ మారింది. ప్రజల ఆలోచన విధానం కూడా ఊహించని రేంజ్ కు మారిపోయింది. ఇక ఆ ప్రభావం ఇండియన్ నెంబర్ వన్ ఇండస్ట్రీగా చెప్పుకునే బాలీవుడ్ పైనే పడడం ఆసక్తికరం. ఆడియెన్స్ రోటీన్ సినిమాలను ఏ మాత్రం ఇష్ట పడడం లేదని ఈ ఏడాది వచ్చిన సినిమాలతో క్లారిటీ వచ్చింది.

అలాగే కాంట్రవర్సీ పబ్లిసిటీ స్టంట్స్ ఎన్ని చేసినా కూడా ఎట్రాక్ట్ అవ్వరని కూడా అర్థమైంది. ఇక కంగనా రనౌత్ ఇటీవల కాలంలో చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ఆమె గత కొంతకాలంగా చేస్తున్న సినిమాలతో మార్కెట్ డౌన్ అవుతూ వస్తోంది.

ఇక దాకడ్ సినిమాతో మరోసారి క్లారిటీగా అర్ధమయ్యింది. కంగనా ప్రధాన పాత్రలో ఫుల్ యాక్షన్ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను థియేటర్లకు ఏ మాత్రం రప్పించలేకపోయింది. కంగనా ఈ సినిమా ప్రమోషన్ విషయంలో క్రియేట్ చేసిన బజ్ మీడియాలో బాగానే హాట్ టాపిక్ గా నిలిచింది.

ఇతర హీరోలపై కూడా ఆమె బలమైమ విమర్శలు చేసింది. దీంతో తప్పకుండా సినిమా ఎంతో కొంత కలెక్షన్స్ అందుకుంటుందని అనుకుంటే దారుణమైన వసూళ్లను సొంతం చేసుకుంది. మొదటిరోజే సినిమా థియేటర్లు ఖాళీగా కనిపించాయి.

ఇక 8వ రోజు అయితే దేశం మొత్తం మీద 20 టికెట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. ఇక కలెక్షన్లు అయితే రూ.4420 మాత్రమే వచ్చాయి. అసలు కంగనా సినిమా అంటే ఒక వారం వరకు బాక్సాఫీస్ వద్ద సందడి చేసేవి. కానీ మొదటిరోజు నుంచి సినిమా ఊహించని విధంగా కలెక్షన్స్ డౌన్ అవుతూ వచ్చాయి.

దాదాపు ఈ సినిమా బడ్జెట్ 90కోట్లు అయినట్లు టాక్. ఇక కలెక్షన్స్ అయితే కనీసం 5కోట్లు రాలేదు. దీంతో ఏ స్థాయిలో నష్టాలు వచ్చి ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎంతో హార్డ్ వర్క్ చేసి కంగనా ఈ సినిమా చేసింది కానీ అందుకు తగ్గ ఫలితం రాలేదు. మరి ఈమె భవిష్యత్తు సినిమాల పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.


Recent Random Post: