ఐశ్వర్య కూతురు ఎంత ఎదిగిపోయిందో..

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ నీతా అంబానీల తనయుడు అనంత్ అంబానీకి విరెన్ మర్చెంట్ శైల దంపతుల కుమార్తె రాధిక మర్చెంట్ కు గురువారం సాయంత్రం ఘనంగా నిశ్చితార్థం జరిగింది. అయితే ఈ వేడుకకు ఇరు కుటుంబాలకు చెందిన బంధువులు స్నేహితులు హాజరయ్యారు. అలాగే పలువురు సినీ ప్రముఖులు కూడా వచ్చారు. అలాగే బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యా రాయ్ ఆమె కూతురు ఆరాధ్యతో కలిసి ఈ ఫంక్షన్ లో సందడి చేసింది.

బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్ అనార్కలీలో ఐశ్వర్యా రాయ్ అదిరిపోయింది. గోల్డెన్ కలర్ హీల్స్ వేసుకొని కనిపించింది. అలాగే ఆమె కూతురు ఆరాధ్య సిల్వర్ అండ్ బ్లూ కలర్ డ్రెస్సులో ముద్ద బంతిలా మెరిసిపోయింది. ఈ క్రమంలోనే కూతురుతో కలిసి ఐశ్వర్యా రాయ్ ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. ఎంతసేపూ తన కూతురు హెయిర్ సర్దడం ఫొటోలకు ఎలా ఫోజులు ఇవ్వాలో చెప్తూ తెగ సందడి చేసేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.

అయితే వీటిని చూసిన నెటిజెన్లు ఒక్కొక్కరూ ఒక్కో విధంగా రెస్పాండ్ అవుతున్నారు. కూతురు మీద ఎంత ప్రేమ చూపిస్తుందో అని ఒకరు కామెంట్ చేయగా.. ఓవర్ ప్రొటెక్టివ్ అంటూ మరొకరు కామెంట్ చేశారు. మీరెప్పుడూ అందంగానే కనిపిస్తారంటూ పలువురు అభిమానులు తెలిపారు. పద్దతైన బట్టల్లో చాలా అందంగా కనిపిస్తున్నారని మరికొంత మంది నెటిజెన్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ఈ వీడియో బయటకు వచ్చిన కాసేపట్లోనే లక్షల లైకులు వేల కామెంట్లు రావడం గమనార్హం. ఈ వీడియోలకు ముందే రాధిక మర్చెంట్ మెహందీ ఫంక్షన్ వీడియోలు ఫొటోలు కూడా నెట్టింట వైరల్ గా మారాయి. అందులో ఆమె గులాబీ రంగు గాగ్రా ధరించి.. ముద్ద బంతిలా మెరిసిపోయింది.

అయితే అనంత అంబానీ రాధిక మర్చెంట్ ల నిశ్చితార్థ వేడు అంగరంగ వైభవంగా సాగినట్లు తెలుస్తోంది. గుజరాతీ సంప్రదాయ పద్దతిలో.. గోల్ ధన చునారి విధి కార్యక్రమాలను నిర్వహించారు. ఆపై ఇరు కుటుంబ సభ్యులు ఒకరికొకరు బహుమతులు ఇచ్చిపుచ్చుకున్నారు. అనంతరం అంతా కలిసి నృత్యాలు చేశారు. ఆపై అనంత్ రాధికలు అందరి సమక్షంలో ఉంగరాలు మార్చుకొని.. పెద్దల ఆశీర్వాదం తీసుకున్నారు. మరికొన్ని నెలల్లో వీరిద్దరి వివాహం జరగబోతున్నట్లు సమాచారం.


Recent Random Post: