అమ్మాయిని బ్లాక్ మెయిల్‌ చేసిన కొరియోగ్రాఫర్ అరెస్ట్‌


సినిమా ఇండస్ట్రీపై మోజుతో వచ్చే అమ్మాయిలను కొందరు కేటుగాళ్లు మోసం చేస్తున్న తీరు ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. ఇటీవల హైదరాబాద్ లో జరిగిన ఒక సంఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. తనను తాను కొరియోగ్రాఫర్ గా పేర్కొన్న మణి ప్రకాష్‌ షార్ట్‌ ఫిల్మ్‌ తీయబోతున్నాం అమ్మాయి కావాలంటూ ప్రకటించాడు. ఆ ప్రకటన చూసి ఒక అమ్మాయి అతడి వద్దకు వెళ్లింది. ఆమె తో ఫొటో షూట్‌ చేసి కొన్ని సన్నివేశాలను కూడా చిత్రీకరించాడు. ఆ సమయంలో ఆ అమ్మాయికి తెలియకుండా అసభ్యంగా ఉన్న ఫొటోలను చిత్రీకరించడం జరిగింది.

అమ్మాయిని లోబర్చుకునేందుకు ప్రయత్నించిన మణికి అది సాధ్యం కాలేదు. దాంతో ఆమెపై కోపంతో ఒక ఫేక్ అకౌంట్‌ ను క్రియేట్‌ చేసి ఆమె గురించి అసభ్యంగా ప్రచారం చేయడం జరిగింది. దాంతో యువతి పోలీసులను ఆశ్రయించింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆ అకౌంట్‌ ను క్రియేట్‌ చేసింది ఎవరో గుర్తించారు. మణి ప్రకాష్ ను పోలీసులు గుర్తించారు. అరెస్ట్‌ చేసిన పోలీసులు ఎంక్వౌరీ చేస్తున్నారు. ప్రస్తుతం అతడు పోలీసులు అదుపులో ఉన్నాడు. అతడి వద్ద ఉన్న ఫొటోలు మరియు వీడియోలను పోలీసులు స్వాదీనం చేసుకున్నారు.


Recent Random Post: