అదా నుంచి మరో ఫిదా అనిపించే లుక్


అదా శర్మ చివరి సారిగా రాజశేఖర్ కల్కి చిత్రంలో కనిపించింది. ఆ తర్వాత బాలీవుడ్ లో `పతి పత్ని ఔర్ పంగ` అనే చిత్రంలో నటించింది. మామ్స్ అండర్ స్టాండ్ బెస్ట్ అనే లఘు చిత్రంతోనూ అదా యూట్యూబ్ లో వైరల్ అయ్యింది. అయితే విప్ర దర్శకత్వంలో క్వశ్చన్ మార్క్` అనే చిత్రంలో నటిస్తోందని ప్రచారమైనా దానికి సంబంధించి సరైన ప్రచారం లేదు. ఈ మేలో రిలీజవుతుందని సమాచారం ఉన్నా అప్ డేట్ అయితే రివీల్ చేయలేదు.

ఆ తర్వాత తనకు సినిమాలేవీ లేవు. ఇటీవల కెరీర్ ఖాళీ అవ్వడంతో సోషల్ మీడియాలో వరుస ఫొటోషూట్లతో వేడెక్కిస్తోంది. ఈ ఫోటోలు వీడియోలతోనే ఇన్ స్టా.. ట్విట్టర్ వేదికగా ఈ భామకు అసాధారణ ఫాలోయింగ్ పెంచుకుంటోంది. మరోవైపు ప్రకటనలతోనూ అదా బాగానే ఆర్జిస్తోంది. తాజాగా అదాశర్మ ఒక వైబ్రేంట్ ఫోటోషూట్ ని షేర్ చేయగా అది వైరల్ గా మారింది.

అదా బ్రాండెడ్ ప్రింటెడ్ కాజువల్ వేర్ ని ధరించి ఫోజులిచ్చింది. ఇక ఈ దుస్తుల్లో థై స్లిట్ ఎలివేషన్ తో పాటు ఇన్నర్ అందాల ఎలివేషన్ యూత్ కి స్పెషల్ ట్రీట్ గా నిలిచింది. అదా పాలనురుగు సౌందర్యానికి తగ్గ కాంబినేషన్ డ్రెస్ ఇది. పసుపు పింక్ బ్లూ వంటి రకరకాల రంగుల మిశ్రమంతో ఈ నైట్ వేర్ చాలా వదులుగా ఎంతో సౌకర్యంగా కనిపిస్తోంది. ఈ ఫోటో యువతరంలో వైరల్ గా మారింది.

అన్నట్టు బ్రాండ్స్ ప్రమోషన్స్ తో అదా ఇటీవల బాగానే ఆర్జిస్తోంది. పలు వస్త్రశ్రేణి బ్రాండ్లకు ప్రచారం చేస్తూ నాలుగు చేతులా సంపాదిస్తోందని అర్థమవుతోంది. సినిమాలు లేకపోయినా ఆదాయవనరు పెంచుకోవడమెలానే అదాకి ఫిదాని అడగాలి.


Recent Random Post: