అందుకే సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నాః హీరోయిన్


ప్రభాస్ ‘బుజ్జిగాడు’ సినిమాతోపాటు పలు తెలుగు చిత్రాల్లో నటించి టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన నటి సంజనా గల్రాని. తెలుగులో టాప్ స్టార్ గా రాణించలేకపోయిన ఈ బ్యూటీ.. కన్నడ నాట మాత్రం పాపులర్ హీరోయిన్ గా నిలిచింది. ఈ సమయంలోనే ఆమె డ్రగ్స్ కేసులో ఇరుక్కొని జైలుకు సైతం వెళ్లి వచ్చింది. ఆ తర్వాత పాషా అనే డాక్టర్ ను రహస్యంగా పెళ్లి చేసుకుంది.

గత లాక్ డౌన్ సమయంలోనే పెళ్లి చేసుకున్న సంజనా.. తాజాగా ఈ విషయాన్ని వెల్లడించింది. అంతేకాదు.. సీక్రెట్ గా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందో కూడా వివరించింది. తమ ఇద్దరికీ పెళ్లి కుదిరిన తర్వాతనే డ్రగ్స్ కేసు బయటకు వచ్చిందని దీంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు తెలిపింది సంజనా.

ఈ కారణంగా తన పెళ్లి విషయాన్ని అందరితో పంచుకోలేకపోయినట్టు తెలిపింది. అయితే.. పెళ్లి తర్వాత గ్రాండ్ గా రిసెప్షన్ అరేంజ్ చేయాలని అనుకున్నప్పటికీ.. లాక్ డౌన్ వల్ల సాధ్యం కాలేదని తెలిపింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ వివరాలు వెల్లడించింది సంజనా.


Recent Random Post: